మేడమ్ టుస్సాడ్ విగ్రహాం ప్రభాస్ అర్హుడు కాదా? | Tamil media cries foul on Prabhas Madame Tussauds statue

Tamil media cries foul on prabhas

Tamil media cries foul on Prabhas, Prabhas Madame Tussauds statue, Why Prabhas not Rajani and Kamal, Prabhas not qualified for Madame Tussauds statue, Kollywood media on Prabhas Madame Tussauds

Tamil media cries foul on Prabhas Madame Tussauds statue.

ప్రభాస్ కు అసలు ఆ అర్హత లేదా!

Posted: 10/06/2016 05:33 PM IST
Tamil media cries foul on prabhas

మనమే తమిళ హీరోలను అందలం ఎక్కిస్తూ వారి సినిమాలకు మంచి బిజినెస్ చేస్తూ ఆదరిస్తుంటే ఇది వారు చేసే పని. తాజాగా ప్రభాస్ మైనపు విగ్రహాం మేడమ్ టుస్సాడ్ జాబితాలో చేరిపోయిన విషయం తెలిసిందే. నార్త్ లో ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీలవి ఉండగా, సౌత్ నుంచి ఫస్ట్ టైం మన డార్లింగ్ విగ్రహాం అక్కడ ఆవిష్కరించబోతున్న సంగతి తెలిసిందే. దీంతో సహజంగానే కొందరిలో అసూయ మొదలైంది. ముఖ్యంగా కోలీవుడ్ లో....

సూపర్ స్టార్ రజనీకాంత్, యూనివర్సల్ హీరో కమల్ హాసన్ లు ఏమయ్యారు? ఎంజీఆర్, శివాజీ గణేషన్ లాంటి వాళ్లు ఉండగా, ఇలా యువ హీరోకి ఇవ్వడం ఏంటని కొందరు సీనియర్ నటులతో ప్రోమోలు కట్ చేయించి మరీ కథనాలు ప్రచురిస్తున్నాయి. అంతేకాదు ప్రభాస్ కు అసలు ఏం అర్హత ఉందంటూ ప్రశ్నలు కురిపిస్తున్నాయి. వారి కోసం ఇక్కడో చిన్న వివరణ..

బాహుబలి కలెక్షన్లు కేవలం ఒక్క తెలుగు భాషతోనే రాలేదు. దక్షిణ భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లామని ఇప్పటిదాకా రాజమౌళి అండ్ చిత్ర యూనిట్ అన్ని ఇంటర్వ్యూలలో చెప్పుకుంటున్నారే తప్ప ఎక్కడా ఒక తెలుగు సినిమా అని కాదు. అంతర్జాతీయ మ్యాగ్జైన్ ఫోర్బ్స్ లో కూడా ప్రభాస్ పై వచ్చిన ఆర్టికల్ ప్రభాస్ పడ్డ కష్టం, త్యాగం, మనోడి ఫిట్ నెస్, అన్నింటికి మించి ఇండియన్ సినిమా సత్తా గురించి రాశారు. చివరగా ఇప్పుడు విగ్రహాం పెట్టేది కూడా బాహుబలి రూపంలో ఉన్న ప్రభాస్ కే. కాబట్టి విమర్శలు చేసేవారు గుర్తించాల్సింది ఏంటంటే... ఇప్పుడు లభిస్తున్న గుర్తింపు ఓ సౌత్ సినిమాకి అని. దిగజారి ఇలా కథనాలు రాసుకుంటే నలుగురిలో చులకన అయ్యి పోయేది మన(సౌత్) పరువే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tamil Media  cries foul  Baahubali Prabhas  Madame Tussauds statue  

Other Articles