మోషన్ పోస్టర్ తో పూనకం తెప్పిస్తున్న ధనుష్ | Dhanush Kodi Motion Poster Creates sensation in Youtube

Dhanush kodi motion poster creates sensation in youtube

Dhanush Kodi Movie Motion Poster, Dhanush Kodi Movie Release Date, Dhanush kodi Movie, Dhanush Kodi turns into Dharma Yogi, Dhanush Dharma Yogi Movies

Dhanush Kodi Movie Motion Poster Creates sensation in Youtube.

ఆ మోషన్ పోస్టర్ సంచలనంగా మారింది

Posted: 10/01/2016 04:08 PM IST
Dhanush kodi motion poster creates sensation in youtube

సౌత్ లో సినిమా ప్రమోషన్ లను బాహుబలి పూర్తిగా మార్చేసిందనే చెప్పాలి. ప్రీ లుక్, ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్, టీజర్, ట్రైలర్ ఇలాంటి ఇప్పడొస్తున్న సినిమాలన్నీ బాహుబలి బాటలోనే నడుస్తున్నాయి. తాజాగా విడుదలైన ఓ చిత్ర మోషన్ పోస్టర్ యూట్యూబ్ లో రికార్డులు క్రియేట్ చేస్తోంది. అదే కోలీవుడ్ యంగ్ హీరో ధనుష్ నటించిన కోడి పోస్టర్.

ధనుష్ ద్విపాత్రాభినయంలో  త్రిష, అనుపమ పరమేశ్వరన్ లు హీరోయిన్లుగా కోడి సినిమా రూపొందింది. గ్రామీణ రాజకీయాల నేపథ్యంలో దర్శకుడు ఆర్ఎస్ దురై సెంథిల్ కుమార్ సినిమాను తెరకెక్కించాడు. త్వరలో ఈ సినిమా విడుదలకు రెడీ అవుతుండగా, నాలుగు రోజుల క్రితం సినిమా మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

ధనుష్ గడ్డంతో మాస్ అవతారం, ఇంకోపక్క క్లీన్ షేవ్ తో మ్యాన్లీగా ఉన్న రెండు గెటప్ ల్లో ఆకట్టుకున్నాడు. అన్నింటికన్నా ముఖ్యంగా సంతోష్ నారాయణన్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ పూనకం తెప్పిస్తోంది. ప్రస్తుతం యూట్యూబ్ లో మిలియన్ మార్క్ కి చేరువైంది ఈ మోషన్ పోస్టర్. కాగా, ఈ చిత్రాన్ని తెలుగులో ధర్మ యోగితో ఒకేసారి విడుదల చేయనున్నారు. ఈ నెల 5న సినిమా ఆడియోను రెండు భాషల్లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dhanush  Kodi  Motion Poster  telugu  Dharma Yogi  

Other Articles