బాలీవుడ్ బార్బీ డాల్ కత్రినా కైఫ్ కి ప్రతిష్టాత్మక స్మితా పాటిల్ అవార్డు అందజేయటంపై వారం రోజులుగా సోషల్ మీడియాలో చెలరేగుతున్న దుమారం తెలిసిందే. ముఖ్యంగా కత్రినాకు ఏం తక్కువ అంటూ రాంగోపాల్ వర్మ చేసిన సపోర్ట్ ట్వీట్ తో వ్యవహారం మరింత ముదిరింది. ఎక్స్ ప్రెషన్స్ కూడా ఇవ్వటం రాని కత్రినాకు ఈ అవార్డు ఇవ్వటం ఏంటో అంటూ నెటిజన్లు ఛలోక్తులు పేల్చగా... నటనకు సంబంధం లేని కుటుంబం నుంచి వచ్చి ఇంత గొప్ప అవార్డు అందుకోవటం గొప్పే కదా అన్నది వర్మ వర్షన్.
అయితే అవార్డు తనకు రావడంపై పలువురు పలురకాల అభిప్రాయాలు వ్యక్తం చేసినప్పటికీ, ఈ అవార్డు ఇచ్చే వారికే తన గురించి పూర్తిగా తెలుసు కనుకే ఇచ్చారని బాలీవుడ్ ముద్దుగుమ్మ కత్రినా కైఫ్ చెప్పింది. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, 'స్మితాపాటిల్ అవార్డు తనకు ప్రకటించగానే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ముఖ్యంగా దర్శకుడు రాంగోపాల్ వర్మ నాకు మద్దతుగా నిలుస్తూ చేసిన ట్వీట్ ను నేను ఎన్నటికీ మరవలేను' అని చెప్పింది.
వర్మ ట్వీట్ లో తన గురించి చెప్పిన ప్రతి విషయం వాస్తవమేనని, ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో తనకు డ్యాన్స్, నటన గురించి ఏమీ తెలియదని చెప్పింది. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత అవి నేర్చుకోవడమంటే గొప్పే కదా? అని కత్రినా తెలిపింది. అన్నట్లు దీపికా పదుకునేకి ఈ అవార్డు ప్రకటించినప్పుడు కూడా ఇదే రీతిలో విమర్శలు వినిపించాయి కూడా. కత్రినా బాలీవుడ్‌లో అడుగుపెట్టిన తక్కువకాలంలోనే సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా పేరు సంపాదించుకుంది. అంతేకాదు దేశంలో అందమైన సెలబ్రిటీల్లో ఒకరని అందుకే ఈ పురస్కారంతో ఆమెని సత్కరించాము అంటూ ప్రియదర్శిని అకాడమీ ఓ ప్రకటనలో పేర్కొంది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more