చిరు కోసం సోషల్ మీడియా సంచలనం | Punjabi sensation for Megastar 150

Punjabi sensation for megastar 150

Punjabi Singer for Chiru 150, Devi introduced another female singer, Punjabi sensation for Chiru, Jasmine Sandlas with Devisri Prasad, Punjabi sensation for Megastar 150, Shriya Saran in Khaidi No.150

Punjabi Female Singer Jasmine Sandlas tollywood debut with Megastar Chiranjeevi Khaidi No.150.

చిరు సినిమా కోసం పంజాబీ సెన్సేషన్

Posted: 09/23/2016 12:37 PM IST
Punjabi sensation for megastar 150

టాలీవుడ్ లో మోస్ట్ అవెయింటింగ్ మూవీగా ఉన్న చిరు 150 ఖైదీ నంబర్ 150 కోసం మెగా అభిమానులే కాదు, యావత్ తెలుగు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. కత్తి రీమేక్ అయినప్పటికీ 9 ఏళ్ల తర్వాత చిరును చూస్తున్నామన్న ఆనందం మాత్రం అందరిలో ఉంది. ఇక దీనికి తగ్గట్లే హంగులను అద్దుతున్నాడు వివి వినాయక్. హీరోయిన్ గా కాజల్ నటిస్తుండగా, ఐటెం సాంగ్ కోసం అరేబియన్ గుర్రంలాంటి కేథరిన్ ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే.

ఇక ఇప్పుడు మరో నటిని గెస్ట్ రోల్ చేయించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. శ్రీయా సరన్ ఈ సినిమాలో ఓ అతిథి పాత్రలో కనిపించబోతుందట. అయితే ఈ విషయంపై అధికార సమాచారం లేకపోయినా దాదాపు ఖరారైనట్లే తెలుస్తోంది. ఇక ఖైదీ కోసం  దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ నుంచి ఇటు సాంగ్స్ వరకూ బాస్ కోసం స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడంట. అట్రాక్షన్ కోసం ఓ పంజాబ్ సింగర్ ని పట్టుకొచ్చాడటం దేవీ. జాస్మిన్ శాండ్లాస్ అనే ఈ లేడీ సింగర్ పంజాబీ సాంగ్స్ తో విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంది.

యూట్యూబ్ లో, సోషల్ మీడియాలో బోలెడంత ఫేమ్ ఉన్న చిన్నది. గతంలో కిక్.. వన్ నైట్ స్టాండ్ వంటి హిందీ చిత్రాలకు కూడా పాటలు పాడింది. ఆమెతో పాట పాడిస్తున్నట్లు చెబుతూ ఆమెతో దిగిన ఓ ఫోటోను షేర్ కూడా చేశాడు రాక్ స్టార్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Punjabi sensation  Female Singer  Jasmine Sandlas  Megastar 150  Khaidi No.150  

Other Articles

Today on Telugu Wishesh