సింధు విజయంపై దర్శకుడి వివాదాస్పద వ్యాఖ్యలు | Director abusive language against Sindhu's achievement

Director abusive language against sindhu s achievement

Sanal Kumar Sasidharan Spit comments, Sanal Kumar Sasidharan PV Sindhu, Director abusive comments on PV Sindhu, malayali director comments on sindhu victory

Sanal Kumar Sasidharan Spit on Sindhu's Silver Medal comments lands him into trouble.

సింధు గెలుపుపై దర్శకుడి వల్గర్ కామెంట్లు

Posted: 08/23/2016 06:40 PM IST
Director abusive language against sindhu s achievement

విమర్శల ద్వారా చూపు తమవైపు తిప్పుకోవాలనే ఆరాటం ఉన్న వ్యక్తులు అందుకోసం మితిమీరి వ్యాఖ్యలు చేస్తున్నారు. రజత పతకంతో భారత్ పరువు నిలపడమే కాదు, తెలుగు వారి ఖ్యాతిని దేశమంత మారుమోగించిన సింధు పై ఓ మళయాళ దర్శకుడు చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

సనాల్ కుమార్ శశిధరన్ పలు ఉత్తమ చిత్రాలను అందించి మాలీవుడ్ లో మంచి దర్శకుడిగా ఉన్నాడు. ఇక సింధు సిల్వర్ మెడల్ విన్నింగ్ ను ఉద్దేశించి తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పిచ్చి ప్రేలాపన చేశాడు. ఆమె విజయంపై నేను ఉమ్మెస్తే మీరంతా ఏం చేస్తారంటూ ఓ సందేశాన్ని పోస్ట్ చేశాడు. అంతే దీనిని చూసిన వారంతా ఆయనగారి తాటతీసి వదిలేస్తున్నారు. దేశానికి గర్వకారణంగా నిలిచిన ఓ యువతి పేరును వాడుకుని ఫ్రీ పబ్లిసిటీ పొందేందుకు ఇంత చీప్ ట్రిక్ ప్లే చేస్తావా అంటూ మండిపడుతున్నారు.

అయితే తన వ్యాఖ్యల అంతర్థాతం తెలుసుకోకుండా శాపనార్థాలు పెడుతున్నారని, సింధు విజయాన్ని తాను ఎంజాయ్ చేస్తున్నానంటూ మరో సందేశం పెట్టాడు. కానీ, అవేం పట్టించుకోని నెటిజన్స్ అతగాడి టైం లైన్ ను మాత్రం పచ్చి బూతులతో నింపేస్తున్నారు.    

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sanal Kumar Sasidharan  PV Sindhu  olmpic victory  abusive  comments  

Other Articles