పవన్ పుట్టిన రోజున చరణ్ ధ్రువ ఆడియో పంక్షన్ | Chiru and Pawan chief guests for Dhrua Audio Launch

Chiru and pawan chief guests for dhrua audio launch

Pawan Kalyan chief guest for Dhruva Audio, Dhruva Audio Launch date, Dhruva audio, pawan chiru again for Charan, Pawan Kalyan cake cut, Pawan chiru and charan

Ram Charan Dhruva audio release on september 2nd. Chiru and Pawan chief guests for that mega event.

మెగా పండగ మరోసారి

Posted: 08/11/2016 01:21 PM IST
Chiru and pawan chief guests for dhrua audio launch

సర్దార్ ఆడియో పంక్షన్ తో మొదలైన మెగా బ్రదర్స్ కలయిక, ఆ సందడి మళ్లీ చూడబోతున్నామా? తనయుడి ఆడియో పంక్షన్ కి పవర్ స్టార్ చీఫ్ గెస్ట్ గా రాబోతున్నాడా? అవుననే సంకేతాలు మెగా కాంపౌండ్ నుంచి అందుతున్నాయి.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చరణ్ కథానాయకుడిగా 'ధ్రువ' చిత్రం తెరకెక్కుతోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ సినిమాను అక్టోబర్ 7న విడుదల చేయనున్నారు. ఈ లోగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్టులుక్ ను ఆగస్టు 15న రిలీజ్ చేయనున్నారు. ఇక చిరంజీవి బర్త్ డే అయిన ఆగస్టు 22న, టీజర్ ను వదలనున్నారు. పవన్ కల్యాణ్ పుట్టినరోజు సెప్టెంబర్ 2న కావడంతో, ఆ రోజున ఈ సినిమా ఆడియో వేడుకను నిర్వహించనున్నారని సమాచారం.

ఈ ఆడియో రిలీజ్ కి ముఖ్య అతిథులుగా చిరు, బాబాయ్ పవన్ కల్యాణ్ ను పిలవాలనే ఆలోచనలో చరణ్ ఉన్నాడంట. అంతేకాదు ఈ వేదికపైనే బ్రదర్స్ కేక్ కట్ చేయటం కూడా చేయించాలని, తద్వారా మెగా బంధాన్ని మరోసారి చాటాలని చెర్రీ ఫ్లాన్ చేయిస్తున్నాడు. నాయక్ తర్వాత పవన్ చెర్రీ సినిమాకు హాజరవు అవుతుండటం, పైగా చిరు, పవన్ లు మళ్లీ కలుస్తుండటంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని భావిస్తున్నాడు. అందుకే ఆడియో రిలీజ్ జరగవలసిందేనంటూ, ఆ దిశగా పనులను దగ్గరుండీ మరి చూసుకోబోతున్నాడంట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Charan  Dhruva  audio launch  pawan kalyan  birthday  chiru  pawan  chief guests  

Other Articles

Today on Telugu Wishesh