హనీసింగ్ పాటకు ఎంత కష్టమొచ్చింది? | Sanskrit version of Honey Singh's Dheere Dheere Se troll

Sanskrit version of honey singh s dheere dheere se troll

Sanskrit version of Honey Singh's Dheere Dheere Se, Dheere Dheere Se troll on social media, Sanskrit version of Honey Singh song, Dheere Dheere Se song sanskrit version, pankaj Jha Dheere Dheere Se song

Sanskrit version of Honey Singh's Dheere Dheere Se troll on social media

హనీసింగ్ పాటకు ఎంత కష్టమొచ్చింది?

Posted: 07/21/2016 02:51 PM IST
Sanskrit version of honey singh s dheere dheere se troll

హనీసింగ్ ఇండియన్ పాప్ ప్రపంచంలో ఓ కొత్త ఒరవడిని సృష్టించాడు. ప్రైవేట్ ఆల్బమ్ లతోపాటు బాలీవుడ్ చిత్రాలకు పాటలను పాడుతూ సెన్సేషన్ గా మారిపోయాడు. అలాంటి హనీసింగ్ పాటలను అడవి జంతువులను తరిమేందుకు రైతులు వినియోగిచడం చూశాం, ఐఎస్ ఉగ్రమూకను మట్టుపెట్టేందుకు భద్రతాదళాలు వాడటం తెలిసిందే. కానీ, ఇప్పుడు ఆయనగారి పాటకు పట్టిన పరిస్థితిని చూస్తే ఎవరైనా నవ్వుకోవాల్సిందే...

యో యో హనీసింగ్ ధిరే ధిరే సే.. పాట ఎంత వైరల్ అయ్యిందో మనకు తెలుసు. రాహుల్ రాయ్, అను అగర్వాత్ ప్రధాన పాత్రలో వచ్చిన అషికీ సినిమాలో కుమార్ సాను పాటిన ఈ పాట ఎంత హిట్టయ్యిందో తెలిసిందే.  దీనిని తీసుకుని హృతిక్ రోషన్, సోనమ్ కపూర్ ప్రధాన పాత్రలుగా ఓ ఆల్బం చేశాడు. అది కూడా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు హనీసింగ్ పాటను తన స్టైల్లో రీమిక్స్ చేశాడు మరోక యువకుడు.

పంకజ్ జా అనే యువకుడు అచ్చ సంస్కృతంలో పాడిన పాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. సంస్కృతంలో పీహెచ్ డీ చేస్తున్న పంకజ్ హనీసింగ్ ఆలాపించిన ఈ పాటను తనదైన శైలిలో ఆసక్తికరంగా పాడాడు.  క్లాస్ రూంలో ఓ రోజు పాఠాలు చెబుతుండగా తన విద్యార్థుల్లోని ఓ పిల్లాడు విసిరిన ఛాలెంజ్ తోనే తానీ పాట పాడాల్సి వచ్చిందని చెబుతున్నాడు పంకజ్. మీరూ ఓసారి ఆపాటను చూసే(వినే)యండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Honey Singh  Dheere Dheere Se  Pankaj jha  sanskrit version  

Other Articles