actress lavanya tripathi doing tamil film named mayaan.

Actress lavanya tripathi doing tamil film named mayaan

mayaan movie, lavanya tripathi, lavanya movies, lavanya tripathi hot, lavanya tripathi movies, lavanya tripathi upcoming movies, lavanya tripathi next movie

lavanya tripathi doing phychriatrist role in tamil film named mayyan. in this movie sandeep kishan doing main role.

మళ్లీ అటు గాలి మళ్లింది...!!

Posted: 07/12/2016 03:06 PM IST
Actress lavanya tripathi doing tamil film named mayaan

లావణ్య త్రిపాఠి చిన్న హీరోయిన్ గా కెరియర్ ని స్టార్ట్ చేసి టాప్ హీరోయిన్ గా ఎదిగింది. ముఖ్యంగా కుర్రహీరోల సరసన నటిస్తూనే ఒక్క సినిమాలో నాగార్జున సరసన సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలో నటించేసరికి అమ్మడి రేంజ్ మారిపోయింది. లావణ్య త్రిపాఠి ప్రస్తుతం తెలుగులో కుర్రహీరోల సినిమాలతో బిజీ బిజీగా ఉంది. నిజానికి ఈ అమ్మడు ఇండస్ట్రీకి వచ్చి పది సంవత్సరాలు పైనే అయ్యింది. 2006 లో హిందీలో వచ్చిన ష్ ఫిర్ కోయి హై సీరియల్ తో అరంగేట్రం చేసింది ఈ బ్యూటీ. తర్వాత లావణ్యకి సరిగ్గా ఆఫర్లు రాలేదు. అందుకే మోడలింగ్ వైపు మనసు మళ్లింది.

టాలీవుడ్ లో అందాల రాక్షసిగా పరిచయం అయ్యిన ఈ సొట్టబుగ్గ సుందరి తర్వాత మంచు విష్ణుతో కలిసి దూసుకెళ్తా సినిమాలో నటించింది. ఆ సినిమా ఫ్లాప్ అయ్యేసరికి అమ్మడికి తెలుగులో అవకాశాలు అంతగా రాలేదు. అందుకే తమిళంలో లెగ్ పెట్టింది. 2014లో తమిళంలో బ్రాహ్మణ అనే సినిమాలో నటించింది. ఆ సినిమా డిజాస్టర్ అయ్యేసరికి లావణ్యని ఎవ్వరూ అక్కడ పట్టించుకోలేదు.

అయితే, తెలుగులో మారుతి డైరెక్షన్ లో వచ్చిన భలే భలే మగాడివోయ్ సినిమాతో పిచ్చ క్రేజ్ ని తెచ్చుకున్న ఈ పాప ఇప్పుడు మరోసారి తమిళంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. 'మాయాన్' అనే సినిమాలో సైక్రియాట్రిస్ట్ గా నటిస్తోంది. ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ కి ఉండటంతో తెగ టెన్షన్ పడుతోంది పాప. హర్రర్ మూవీగా తెరకెక్కుతున్న ఇందులో లావణ్య ఒక సైకియాట్రిస్ట్‌గా నటించిందట. త్వరలో విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమాలో తన పాత్ర మంచి పేరు తీసుకొస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఈ క్యారెక్టర్ కోసం తను నిజంగా సైక్రియాట్రిస్టుల దగ్గరకి వెళ్లి మరీ వాళ్ల బాడీలాంగ్వేజ్, మాట్లాడే పద్దతిని తెలుసుకున్నానని, అందుకే చాలా ఈజీగా ఆ క్యారెక్టర్ లో నటించగలిగానని చెప్తోంది.

ఈ అమ్మడి గాలి మళ్లీ కోలీవుడ్ కి మళ్లిందని ఇలాగే సినిమాలు చేసుకుంటూ పోతే రెండు మూడు సంవత్సరాలకి టాప్ హీరోయిన్ గా సౌత్ ఇండియానే షేక్ చేస్తుందని చెప్తున్నారు సినీ విశ్లేషకులు.

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles