bahubali movie in china

Bahubali movie in china

bahubali, kattappa, rajamouli, rana, prabhas, anushka, tamannah, bahubali in china, arka media, arka media producers, bahubali collections, bahubali in china language, china babhubai

bahubali the begining director rajamouli planing to release the cinema in china language. 6500 screens already booked for this movie in july

చైనాలో బాహుబలి దండయాత్ర..!

Posted: 06/29/2016 10:23 AM IST
Bahubali movie in china

డైరెక్టర్ రాజమౌళి సృష్టించిన బాహుబలి సంచలనాలు ఇంకా ఆగలేదు. ఈ సినిమా ఇండియన్ సినిమా చరిత్రనే తిరగరాస్తోంది. ప్రస్తుతం చైనాలో ఈ సినిమా జోరుగా ప్రచారం అందుకుంది. దీనికోసం బాహుబలి టీమ్ స్పెషల్ గా చైనాలో ప్రమోషన్స్ కార్యక్రమాలను సైతం చేపట్టారు. మొట్టమొదటిసారిగా ఒక ఇండియన్ సినిమా అందులోను తెలుగు సినిమా చైనాలో 6500 పైగా స్క్రీన్స్ పై విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాని జులై 22వ తేదిన విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు. దీనికి సంబధించిన పోస్టర్స్ ని సోషల్ సైట్స్ లో పెట్టింది చిత్రయూనిట్.

బాహుబలి ద బిగినింగ్ సినిమాని చైనాలో ఈస్టార్స్ అనే మీడియా సంస్థ డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరిస్తోంది. ఈ సినిమాని చాలా ప్రతిష్టాత్మకంగా చైనాలో విడుదల చేయనున్నారు. సుమారు 200కోట్లకు పైగా కలెక్షన్స్ సాధిస్తుందని అంచనాలు వేస్తున్నారు. ఇప్పటికే చైనాలో టాప్ రేంజ్ లో బిజినెస్ జరిగిందని ఇక విడుదలై హిట్ కొడితే మాత్రం సినిమాకి ఊహించిన దానికంటే ఎక్కువే కలెక్షన్స్ వస్తాయని చెబుతున్నారు సినీ ట్రేడ్ పండితులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles