టీజర్: చూడచక్కని మనమంతా | mohanlal manamantha teaser released

Mohanlal manamantha teaser released

mohanlal telugu debut movie manamantha, manamantha teaser, mohan lal manamantha teaser, Chandra Sekhar Yeleti manamantha, mohanlal news, telugu movies, latest news, మనమంతా టీజర్, తాజావార్తలు, తెలుగు వార్తలు, సినిమా వార్తలు, మనమంతా మోహన్ లాల్, మోహన్ లాల్ గౌతమీ, విశ్వంత్ మనమంతా

mohanlal telugu debut movie manamantha directed by chandra shekar yeleti teaser released. Introducing The Complete Actor - Mohan Lal to Tollywood Film Industry. Manamantha Movie is directed by Chandra Sekhar Yeleti. Movie is Produced by Rajani Korrapati. Manamantha is a Sai Korrapati Production presented by Sai Shivani under Vaaraahi Chalana Chitram Banner.

టీజర్: చూడచక్కని మనమంతా

Posted: 06/25/2016 03:00 PM IST
Mohanlal manamantha teaser released

ఒక ప్రపంచం నాలుగు కథలు అంటూ అనే మరో ఫ్యామిలీ ఓరియెంటల్ చిత్రం తెలుగులో రాబోతుంది. మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ టాలీవుడ్ డెబ్యూ మూవీ మనమంతా  చిత్ర టీజర్ శనివారం ఉదయం విడుదలైంది. ఐతే, అనుకోకుండా ఒకరోజు, ఒక్కడున్నాడు, ప్రయాణం, సాహసం లాంటి ఢిపరెంట్ జోనర్ చిత్రాలు అందించిన చంద్రశేఖర్ యేలేటి దీనికి దర్శకత్వం వహించబోతున్నాడు.

ఓ స్కూల్ విద్యార్థిని, ఓ ఇంజనీరింగ్ స్టూడెంట్,  ఓ గృహిని, ఓ సూపర్ మార్కెట్ లో పనిచేసే వ్యక్తి ఈ నలుగురి జీవిత ప్రయాణం కలిస్తే అదే మనమంతా. కేరింత ఫేం విశ్వంత్ అభిరామ్ పాత్రలో, హౌజ్ వైఫ్ గాయత్రి పాత్రలో నటి గౌతమి, సూపర్ మార్కెట్లో అసిస్టెంట్ మేనేజర్ సాయిరాంగా మోహన్ లాల్ అలరించనున్నారు.

ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని భావించే చిన్నారి.. తనను ప్రేమించిన వాళ్లకోసం ఏవైనా అమ్మేసే కుర్రాడు.. గౌరవం కావాలని కోరుకునే గృహిణి.. పొదుపుగా జీవించే మధ్య తరగతి వ్యక్తి పాత్ర. స్వభావాలను టీజర్ లో చూపించారు. బతకటం నేర్చుకుంటున్నానుకున్నా.. కానీ, మనిషిలా బతకటం మరిచిపోయా... అంటూ చివర్లో మోహన్ లాల్ చెప్పే డైలాగ్ తో చిత్రం ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా గా ఉండబోతుందని అర్థమౌతోంది.

ఈ సినిమా కోసం తెలుగు నేర్చేసుకున్న మోహన్ లాల్ సొంత డబ్బింగ్ చెప్పుకోవటం విశేషం. ప్రతిష్టాత్మక సంస్థ వారాహి బ్యానర్ పై సాయి కొర్రపాటి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం విస్మయం పేరుతో మళయాళంలోనూ రూపుదిద్దుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles