venkatesh movie babubangaram motion poster released

Venkatesh movie babubangaram motion poster released

babu bangaram movie, venky stills, venky motion poster, venky poster comedy, maruthi and venky combo, venky movie babu bangaram, venky movie tickets, babu bangaram movie tickets

hero victory venkatesh and director maruthi combination film babu bangarm. this film unit released one motion poster for fans.

బాబు పోస్టర్ అదిరింది...!

Posted: 06/23/2016 12:56 PM IST
Venkatesh movie babubangaram motion poster released

విక్టరీ వెంకటేష్ మారుతి డైరెక్టర్ గా చేస్తున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ బాబు బంగారం. ఈ సినిమా ఆడియో విడుదలకు ముస్తాబవుతోంది. ఈ నేపథ్యంలో సినిమాకి సంబంధించిన డిఫరెంట్ పోస్టర్స్ ని రిలీజ్ చేస్తూ సోషల్ సైట్ లో వెంకీ పిచ్చెక్కిస్తున్నాడు. కొత్తదనం, టెక్నాలజీ అంటూ టాలీవుడ్ ఈ మధ్యన వెరైటీగా అన్నీ ప్లాన్ చేస్తోంది చిత్రయూనిట్. లేటెస్ట్ గా దర్శకుడు మారుతి ఈ సినిమా మోషన్ పోస్టర్ ఒకటి రిలీజ్ చేశాడు. ఇందులో వెరైటీ ఎంటంటే, టైటిల్ సాంగ్ ని మిక్స్ చేసి 14 సెకన్స్ పాటు వీడియోని రిలీజే చేశారు. ఈ పోస్టర్ లో వెంకీ చేతులు మాత్రమే కదులుతున్నట్లుగా వీడియోని రూపొందించారు. ఇది చూసిన అందరూ వెంకీ స్టైల్ డిఫరెంట్ అని తెగ కామెంట్స్ చేసేస్తున్నారు.

ఈ సినిమా అన్ని హంగులతో జూలై లో విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో వెంకీ సరసన ముచ్చటగా మూడోసారి నయనతార హీరోయిన్ గా ఆడి పాడనుంది. పక్కా ఫ్యామిలీ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని చేసిన ఈ సినిమాపై విక్టరీ వెంకటేష్ ఫ్యాన్స్ ఎన్నో అంచనాలను పెట్టుకున్నారు.

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : babu bangaram movie  victory venkatesh  venky  director maruthi  

Other Articles