tollywood actress reveale yoga secrets in their life

Tollywood actress reveale yoga secrets in their life

tollywood yoga, actress yoga, yoga heroines, heroines yoga stills, yoga stills heroines, yoga in daily life, yoga secrets, yoga in movies

tollywood actress reveal yog secrets in their personal life. the beautiful actress saying yoga is good for health.

ముద్దుగుమ్మల యోగాసానాలు..!

Posted: 06/21/2016 11:07 AM IST
Tollywood actress reveale yoga secrets in their life

- భూమిక

టాలీవుడ్ లో హీరోయిన్స్ అందరూ యోగా, ఎరోబిక్స్, వ్యాయామం, జిమ్ ఇలా ఏదో ఒకరకంగా వారి ఫిట్ నెస్ ని కాపాడుకుంటూనే ఉంటారు. ముఖ్యంగా జీరో షేప్ తీసుకురావాలనుకునే హీరోయిన్స్ చాలామందే ఉన్నారు. ఈరోజు ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా మరి వారి ఫిట్ నెస్ రహస్యాలు ఏంటో ఒక లుక్కేయండి..

'' యోగా అంటే వ్యాయామం కాదు, యోగా అంటే ఆరోగ్యానికి చేసే మేలుకొలుపు. ప్రతిరోజూ యోగా చేస్తేనే నేను మిగతా పనులు చేస్తాను. మనకంటూ జీవితంలో మిగిలే సమయం అది ఒక్కటే అని అందరూ గుర్తుంచుకోవాలి ''

- ఇలియానా

‘‘యోగా వ్యాయామం కాదు... ఔషధం. యోగాతో స్నేహం చేస్తే చాలా సమస్యల్ని దూరం చేసుకొన్నట్టే. రోజుకి ఒక్క గంట సేపు యోగా చేసి చూడండి... మీ జీవితంలో చాలా మార్పులొస్తాయి. ఆ మార్పులు మీ విజయానికి చిహ్నాలుగా మారడానికి ఎంతో కాలం పట్టదు. ఏకాగ్రతకు, క్రమశిక్షణకు యోగా అద్భుతమైన మార్గం’’

- అనుష్క

'' బరువు పెరగడం, తగ్గడం అనేది మన చేతుల్లోనే ఉన్నప్పుడు మన ఆరోగ్యం కూడ పాడవ్వడం, బాగుపడటం అనేది మన చేతుల్లోనే ఉంటుంది కదా. అలాంటపుడు మనకంటూ మనం సమయాన్ని కేటాయించి యోగా చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకుంటాం కదా. అందుకే అందరూ తప్పకుండా యోగా చేయండి. నేను ప్రతిరోజూ ఎంత బిజీగా ఉన్నా ఖచ్చితంగా యోగాకి అంటూ టైమ్ కేటాయిస్తాను.

- రాశీ ఖన్నా

‘‘నా జీవితంలో యోగాకి కొంత టైమ్‌ ఉంది. ఎప్పుడైతే నా రోజులో యోగాకి సమయం కేటాయించానో అప్పటి నుంచీ నా జీవితం మారింది. యోగా అంటే... ఆరోగ్యం ఒక్కటే కాదు. మానసిక పరివర్తన. ఏదైనా ఓ రోజు సెట్లో గందరగోళంగా, అసంతృప్తిగా కనిపించానంటే ఆ రోజు నేను యోగా చేయనట్టే లెక్క’’

- హన్సిక

‘‘నా రోజు యోగాతో ప్రారంభమవుతుంది. గత నాలుగేళ్లుగా యోగా గురించి ఆలోచించని రోజు లేదేమో? యోగా గురించి పుస్తకాలు, వీడియోలు సేకరిస్తుంటా. నా స్నేహితులకు, బంధువులకు యోగా గురించి చెప్తుంటా. యోగా ఎన్ని అద్భుతాలు చేయగలదో... యోగా చేసేవాళ్లకే తెలుస్తుంది. సినిమా అనే కాదు, ప్రతీ రంగంలోనూ ఎన్నో ఒత్తిళ్లుంటాయి. వాటిని అధిగమించే మార్గం నాకు యోగాతో దొరికింది. మన శరీరం మన అదుపులో ఉండడం చాలా ముఖ్యం. అయితే దానికి మన వంతుగా శ్రమించడం అవసరం. అందుకు యోగా చేసి తీరాల్సిందే’’

- మంచు లక్ష్మి

'' యోగా అనేది నా నిత్యజీవితంలో ఒక పనిలాంటింది. ప్రతిరోజూ భోజనం ఎలా చేస్తానో అలాగే యోగా కూడ చేస్తాను. ఇప్పుడు చాలామందికి యోగాపై అవగాహన ఏర్పడింది. ఇది మంచి పరిణామం. నేను నా బాడీని షేప్ చేసేందుకు యోగా చెయ్యను. ఆరోగ్యంగా ఉండేందుకు మాత్రమే చేస్తాను.''

- శ్రియ

'' ఆరోగ్యంగా ఉండాలంటే యోగా చెయ్యాల్సిందే. యోగా ఆసనాలు వేయడం రావట్లేదని చాలామంది మానేస్తారు. అలాంటి వాళ్లు ఫిట్ నెస్ కోసం వేరే మార్గాలు అన్వేషించుకోవాలి. నేను మాత్రం క్రమం తప్పకుండా జిమ్ చేస్తాను''


- పరిటాల మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : anushka yoga  hansika  lavanya tripathi  bhoomika  rasikhanna  ileana  

Other Articles