pawan kalyan next coming movie director change

Pawan kalyan next coming movie director change

pawan director change, pawan kalyan director change, pawan movie director, director dollyw, dorector sj suriya, sj surya actor, pawan kalyan change his mind, pawan next movie, pawan next movie title

pawan kalyan upcoming movie director surya replaced by dolly. dolly is also good director in the past he is directed by pawan kalyan for the movie of gopala gopala. now dolly got a chance to direct pawan kalyan in his next movie

డైరెక్టర్ ఎందుకు మారాడు...!

Posted: 06/20/2016 11:49 AM IST
Pawan kalyan next coming movie director change

 మరోసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సినిమాకి డైరెక్టర్ ని మార్చి వార్తల్లోకి వచ్చాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎస్ జె సూర్య కాంబినేషన్ లో ఒక సినిమాని ప్రారంభించిన సంగతి తెలసిందే. ఈ సినిమా రేపో మాపో సెట్స్ పైకి వెళ్తుంది అనేలోపు పవన్ తన డైరెక్టర్ ని మార్చి సంచలనం సృష్టించాడు.

 ఎస్.జె.సూర్య స్థానంలో కిషోర్ పార్థసాని (డాలీ) కొత్త కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఎస్.జె.సూర్య దర్శకత్వంలో ఓ కొత్త చిత్రాన్ని ప్రారంభించారు. 'ఖుషి' , 'కొమరంపులి'  తర్వాత పవన్ కల్యాణ్ తో ఎస్ జె సూర్యతో ముచ్చటగా మూడో సినిమా తెరకెక్కించాలనుకొన్న ఆయన ప్రయత్నం ఫలించలేదు. అందుకు కారణం ఎస్ జె సూర్య నటుడిగా బిజీ కావడమే అని చెప్తున్నారు. తమిళంలో ఎస్.జె.సూర్య నటించిన 'ఇరైవి' ఇటీవలే విడుదలైంది. అందులో ఆయన నటనకు ప్రశంసలు లభించాయి.

తమిళం, తెలుగు నుంచి పలువురు అగ్ర దర్శకులు ఎస్.జె.సూర్యకు నటుడిగా అవకాశాలు ఇస్తున్నారు. దీంతో దర్శకత్వం చేయడానికి ఆయన దగ్గర తగినంత సమయం లేదు. ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ కి చెప్పడంతో ఆయన   స్థానంలో డాలీకి అవకాశమిచ్చాడు పవన్. ఇదివరకు పవన్కల్యాణ్ తో 'గోపాల గోపాల' చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు డాలీనే. డాలీ పనితీరును మెచ్చుకొంటూ ఆయనతో మరో సినిమా చేస్తానని పవన్ అప్పట్లోనే చెప్పాడు కూడ. చెప్పినట్టుగానే ఆయనకి ఇప్పుడు అవకాశమిచ్చాడు. ఇదివరకు 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రానికీ ఇలాగే దర్శకుడు మారాడు. మొదట సంపత్ నందిని అనుకొన్నారు. ఆ తర్వాత ఆయన స్థానంలో బాబీని ఎంచుకొన్నారు. ఇప్పుడు కొత్త చిత్రం విషయంలోనూ అలాగే జరిగిందని ఫిలిం నగర్ లో చెప్పుకుంటున్నారు.

కొసమెరుపు ఏంటంటే ఎస్ జె సూర్య మహేష్ బాబు మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు.

-మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  director dolly  director sj surya  pawan  powerstar  pawan next movie  

Other Articles