rajamouli awarded cnn ibn indian of the year

Rajamouli awarded cnn ibn indian of the year

rajamouli, rajamoli next, rajamouli bahubali, bahubali next, bahubali part 2, rajamouli awards, rajamouli film awards, rajamouli cnn ibn, rajamouli bahubali

rajamouli awarded cnn ibn indian of the year : director rajamouli selected and awarded cnn ibn news channel as an indian of the year 2016. the bollywood stars priyanka and ranbir also in race of this award. but rajamouli got this award in this year

దేశంలోనే సిసలైన మొనగాడు..!

Posted: 06/10/2016 11:40 AM IST
Rajamouli awarded cnn ibn indian of the year

ప్రతి సంవత్సరం సిఎన్ ఎన్ ఐబిఎన్ ఛానల్ నిర్వహించే ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ ని కైవసం చేసుకున్నాడు జక్కన్న. ఇండియాలోనే తనకంటే సిసలైన మొనగాడు లేడని చాటాడు. ఎంటర్ టైన్మెంట్ విభాగంలో ఈ అవార్డు జక్కన్నని వరించింది.

బాహుబలి సినిమాతో తెలుగు సినిమా చరిత్రని దశదిశలా చాటిన దర్శకుడు రాజమౌళి. టాలీవుడ్ లో ఇప్పటివరకూ కనీ వినీ లేని రికార్డ్స్ ని ఎన్నింటినో కొల్లగొట్టింది ఈ చిత్రం. ఇటీవలే చైనా మీడియా సైతం ఈ సినిమాని పొగడ్తలతో ముంచెత్తిన సంగతి తెలిసిందే.

బాహుబలి సినిమా ఇంత అత్యద్భుతంగా తీసినందుకు రాజమౌళికి అనేక అవార్డులు, రివార్డులు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మరో ఈ అరుదైన గౌరవం అందుకున్నాడు రాజమౌళి. 2015 సంత్సరానికి గాను 'ఇండియన్ ఆఫ్ ది ఇయర్‌' గా నిలిచాడు మన జక్కన్న.

నిజానికి రాజమౌళితో పాటు బాలీవుడ్ నుంచి ప్రియాంక చోప్రా, రణబీర్ లు కూడా ఈ అవార్డు కోసం నామినేట్ అయినప్పటికీ రాజమౌళినే ఈ అవార్డు వరించడం విశేషం. బాహుబలి టీమ్ కష్టానికి ప్రతిఫలంగా ఈ అవార్డు నాకు లభించింది. అందుకే ఈ అవార్డును బాహుబలి టీమ్‌కు అంకితం ఇస్తున్నాఅంటూ రాజమౌళి చెప్పారు.

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ss rajamouli  ss rajamouli upcomin  ss rajamouli movies  rajamouli bahubali  

Other Articles