అర్థంకానీ పోస్టర్.. ఫ్యాన్స్ కు ఖుష్ కబురు | Mohenjo Daro Release Date

Mohenjo daro release date

Mohenjo Daro Motion Poster, Mohenjo Daro first look, Hrithik Roshan Mohenjo Daro, Pooja Hegde Mohenjo Daro, Mohenjo Daro movie news, Mohenjo Daro movie updates, Hrithik Roshan movies, Hrithik Roshan stills, Pooja Hegde latest stills, Pooja Hegde hot stills

Mohenjo Daro Release Date: Starring Hrithik Roshan and Pooja Hegde. A film by Ashutosh Gowariker. Watch now the motion poster of Mohenjo Daro.

అర్థంకానీ పోస్టర్.. ఫ్యాన్స్ కు ఖుష్ కబురు

Posted: 06/07/2016 12:52 PM IST
Mohenjo daro release date

‘బ్యాంగ్ బ్యాంగ్’ తర్వాత దాదాపు రెండేళ్ల విరామం తీసుకొని, బాలీవుడ్ స్టైలిష్ డాన్సింగ్ హీరో హృతిక్ రోషన్ నటిస్తున్న తాజా చిత్రం ‘మొహెంజోదారో’. అశుతోష్ గౌరీకర్ దర్శకత్వంలో యూటివి మోషన్ పిక్చర్స్, అశుతోష్ గౌరీఖర్ ప్రొడక్షన్స్ ప్రై.లి. బ్యానర్లపై నిర్మాతలు సిద్ధార్థ్ రాయ్ కపూర్, సునీత గౌరీకర్, అశుతోష్ గౌరీకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

హృతిక్ రోషన్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను విడుదల చేసారు. సినిమాకు సంబంధించిన నటీనటులు ఎవరూ కనిపించకుండా కేవలం ఏదో లోగోతో కూడిన టైటిల్ ను మాత్రమే విడుదల చేసారు.

ఈ మోషన్ పోస్టర్ పై అభిమానులు అంతగా సంతృప్తి చెందలేరు కానీ.. హృతిక్ రోషన్ అభిమానులు ఆనందపడే ఓ వార్తను మాత్రం చిత్ర యూనిట్ ప్రకటించారు. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆగష్టు 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించనున్నారు. త్వరలోనే ఆడియో, ట్రైలర్లను కూడా విడుదల చేయనున్నారు.

- Sandy

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mohenjo Daro  Hrithik Roshan  Pooja Hegde  

Other Articles