అందాల కాజల్ తో మహేష్ చిందులు | Bala Tripuramani Song Making

Bala tripuramani song making

Bala Tripuramani Song Making, Brahmotsavam Movie Songs Making, Brahmotsavam Making, Brahmotsavam Movie Updates, Brahmotsavam Movie Stills, Brahmotsavam Posters, Brahmotsavam Release Date, Brahmotsavam Songs, Brahmotsavam Videos, Brahmotsavam Trailers

Bala Tripuramani Song Making: Brahmotsavam Movie Songs Making. Bala Tripuramani Song ft. Mahesh Babu, Kajal Aggarwal, Samantha and Pranitha. Directed by Srikanth Addala and music composed by Mickey J Meyer.

అందాల కాజల్ తో మహేష్ చిందులు

Posted: 05/14/2016 04:02 PM IST
Bala tripuramani song making

ఎక్కడ చూసిన బ్రహ్మోత్సవం టీం తెగ సందడి చేసేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన ‘బ్రహ్మోత్సవం’ సినిమా ఈనెల 20న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సంధర్భంగా ఈ సినిమాలోని ‘బాల త్రిపురమణి...’ అనే సాంగ్ మేకింగ్ వీడియోను తాజాగా విడుదల చేసారు. ఈ మేకింగ్ వీడియోకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

మిక్కీ జే.మేయర్ సంగీతం అందించిన ఈ పాటకు కృష్ణచైతన్య అద్భుతమైన సాహిత్యాన్ని అందించాడు. ఈ పాటను ప్రముఖ కొరియోగ్రాఫర్ దినేష్ మాస్టర్ చక్కటి డాన్స్ మూమెంట్స్ కంపోజ్ చేసాడు. ప్రస్తుతం ఈ ఆల్బంలో ఈ పాట అందరి ఫేవరేట్ సాంగ్ గా నిలుస్తోంది. ఇందులో మహేష్ చాలా యంగ్ గా కనిపిస్తున్నాడు. బాల త్రిపురమణిగా కాజల్ అందాలు ప్రధానాకర్షణగా చెప్పుకోవచ్చు.

మహేష్ సరసన కాజల్, సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించారు. చిత్ర యూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా వున్నారు. మహేష్, సమంత, కాజల్ తదితరులు పలు మీడియా ఛానెల్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. నిర్మాత పరమ్.వి.పోట్లూరి భారీ బడ్జెట్ తో నిర్మించారు. మరి ఈ సినిమా ఎలా వుండబోతుందో మరికొద్ది రోజుల్లో తెలియనుంది.

- Sandy

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Brahmotsavam  Mahesh Babu  Kajal  Samantha  Praneetha  

Other Articles