అబ్బా.. ఆ వయసులో కూడా మస్తుగా..! | SARBJIT Movie Meherbaan Video Song

Sarbjit movie meherbaan video song

SARBJIT Meherbaan Video Song, Meherbaan Video Song, SARBJIT trailers, SARBJIT stills, SARBJIT posters, SARBJIT movie release date, SARBJIT news, Aishwarya Rai stills, Aishwarya Rai

SARBJIT Meherbaan Video Song: starring Aishwarya Rai Bachchan, Randeep Hooda, Richa Chadda in leading roles, directed by Omung Kumar. The song MEHERBAAN is sung by Sukhwinder Singh, Shail Hada, Munnawar Masoom in the music direction of Shail-Pritesh and lyrics by A M Turaz.

అబ్బా.. ఆ వయసులో కూడా మస్తుగా..!

Posted: 05/05/2016 05:41 PM IST
Sarbjit movie meherbaan video song

ఇటీవలే ‘జజ్బా’తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టిన బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ నటిస్తున్న తాజా చిత్రం ‘సర్బ్ జిత్’. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్లు, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో సర్బ్ జిత్ పాత్రలో రణదీప్ హుడా నటిస్తుండగా, అతని సోదరి దల్బీర్ కౌర్ పాత్రలో ఐశ్వర్యరాయ్ నటిస్తుంది.

ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఈ సినిమాపై భారీ అంచనాలనే పెంచేసింది. ఇక తాజాగా ‘మెహర్ బాన్...’ అనే వీడియో సాంగ్ ను విడుదల చేసారు. ఈ వీడియో చూస్తుంటే ఐశ్వర్య తన వయసుకు మించిన పాత్రను పోషించినట్లుగా తెలుస్తోంది. అలాగే న్యాయం కోసం పోరాటం చేసే ఓ వ్యక్తిగా కనిపిస్తోంది.

ఓమంగ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను వాశూ భగ్నానీ, జాకీ భగ్నానీ, దీప్షికా దేశ్ ముఖ్, సందీప్ సింగ్, ఓమంగ్ కుమార్, భుషన్ కుమార్, క్రిషన్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Aishwarya Rai  SARBJIT  Hot stills  

Other Articles