మెంటల్ టార్చర్ వల్ల ‘ఫ్యాన్’పై కేసు | Case filed on Shah Rukh Khan FAN

Case filed on shah rukh khan fan

Case filed on FAN movie song, FAN movie collections, Case on Fan song, FAN movie 10days collections, FAN movie trailers, FAN movie videos, FAN movie stills, Shah Rukh Khan stills

Case filed on Shah Rukh Khan FAN: FAN is a 2016 Indian thriller film directed by Maneesh Sharma and featuring Shah Rukh Khan in the lead role. The film is produced by Aditya Chopra.

మెంటల్ టార్చర్ వల్ల ‘ఫ్యాన్’పై కేసు

Posted: 04/21/2016 03:41 PM IST
Case filed on shah rukh khan fan

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కు చాలా రోజుల తర్వాత మళ్లీ హిట్ లభించిన చిత్రం ‘ఫ్యాన్’. ఇందులో షారుక్ ద్విపాత్రాభినయం చేసారు. హీరోగా, అభిమానిగా రెండు పాత్రలలో షారుక్ అద్భుతంగా నటించాడు. ఈ సినిమా విడుదలకు ముందు యూట్యూబ్ లో రికార్డులు క్రియేట్ చేసిన సాంగ్ ‘జబ్రా ఫ్యాన్’. ఈ పాటను దాదాపు 11 భాషలలో విడుదల చేసారు. అన్నిచోట్ల కూడా ఈ పాటకు భారీ రెస్పాన్స్ వచ్చింది. వినడానికి చాలా బాగుండటం... మ్యూజిక్ ఆకట్టుకోవడంతో జనాలు ఈ పాటకు బాగా కనెక్ట్ అయ్యారు. కానీ సీన్ కట్ చేస్తే.. ‘ఫ్యాన్’ సినిమాలో ఈ పాట లేదని కోర్టులో కేసు పెట్టింది ఓ మహిళ.

ఫ్యాన్ చనిపోవడం వల్ల ఆ ఆలోచన లేదట

సినిమా విడుదలకు ముందు చేసిన ఈ ‘జబ్రా ఫ్యాన్’ సాంగ్ సినిమాలో లేదని.. దీంతో తాము చాలా డిసప్పాయింట్ ఫీల్ అయ్యామని సంగీత అనే మహిళ.. ఆమె సినిమాను వీక్షించిన థియేటర్ (పివిఆర్ సినిమాస్)పైనా మరియు యశ్ రాజ్ ఫిల్మ్ సంస్థ, షారుక్ ఖాన్ పైనా కేసు పెట్టింది. ఇంకా ఈ కేసులో ఆమె ఆరోపణలు ఏమిటంటే... తమ కుటుంబ సభ్యులందరూ ఒక్కొక్కరూ 650రూపాయలు పెట్టి టికెట్ కొన్నామని, అంత ఖర్చుపెట్టి సినిమాకు వెళ్లినప్పటికీ.. సినిమాలో జబ్రా సాంగ్ లేకపోవడంతో తాము నిరుత్సాహపడ్డామని, అలాగే ఆ సినిమా చూసి చాలా మానసిక వేధనకు గురయ్యామని తెలిపింది. అయితే తమ టికెట్ డబ్బులు 2,600 రూపాయాలతో పాటుగా.. తమకు ఇంత మానసిక వ్యధకు గురిచేసినందుకు అదనంగా మరో యాభై వేల రూపాయలు ఇప్పించాలని కోరుతూ కేసు వేసారు.

ఈ కేసుని డిస్ట్రిక్ కన్సుమర్ కోర్ట్ లో ఫైల్ చేసారు. ఈ కేసు ఈనెల 22న తేలనుంది. మరి ఈ విషయంపై ఎలాంటి తీర్పు వెలువడనుందో చూడాలి. ఒకవేళ ఈ కేసు కొట్టివేస్తే పర్వాలేదు కానీ.. ఒకవేళ వారు కేసుపెట్టినట్లుగా డబ్బులు ఇవ్వాలని తీర్పు ఇస్తే మాత్రం... ఇక భవిష్యత్తులో ఏ సినిమా విడుదలైన కూడా జనాలందరూ కూడా ఇలాగే కేసులు పెట్టుకుంటూ వెళతారు. సదరు హీరోల యాంటీ ఫ్యాన్స్ మరింత ఎక్కువగా కేసులు పెట్టే అవకాశాలు వున్నాయి. మరి కోర్టు తీర్పు ఎలా వుండనుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Shah Rukh Khan  Fan  collections  

Other Articles