Karishma Kapoor And Sunjay Kapur Agree To Separate Amicably

Karishma sanjay kapoor reach settlement on divorce terms

karisma kapoor, sunjay kapur, karisma sunjay divorcekarisma kapoor divorce, settlement, sunjay kapur divorce settlement, sunjay kapur, divorce, supreme court, amicable divorce, bollywood

Karisma Kapoor and her estranged husband Sunjay Kapur have come to an agreement on modalities for separation before the Supreme Court.

భర్తతో అలా విడాకుల ఒప్పందం చేసుకున్న నటి

Posted: 04/09/2016 05:50 PM IST
Karishma sanjay kapoor reach settlement on divorce terms

బాలీవుడ్ నటి కరిష్మా కపూర్, ఆమె మాజీ భర్త సంజయ్ కపూర్ మధ్య విడాకుల వివాదం ముగిసింది. గత కోన్నేళ్లుగా వీరి మద్య కలతలు చెలరేగి పండంటి సంసారం కస్తా కలహాల కాపురంగా మారింది, అవి అలా అలా చెలరేగుతూ విడాకుల స్థాయి వరకు దారి తీసింది, దీంతో వీరిద్దరూ తమకు విడాకులు కావాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు, ఈ నేపథ్యంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం వీరిద్దరని ఒక అవగాహనకు రావాలని అదేశించింది,

దీంతో కరిష్మాకపూర్, సంజయ్ కపూర్ లిద్దరూ ఓ ఒప్పందానికి రావడంతో ఏళ్లుగా సాగుతున్న వివాదానికి ఫుల్‌స్టాప్ పడింది. ఒప్పందం ప్రకారం.. కరిష్మా, సంజయ్ కపూర్ ల సంతానమైన వారి ఇద్దరు పిల్లలు కరిష్మ సంరక్షణలో ఉంటారు. సంజయ్‌కి ఆ పిల్లల సందర్శన హక్కులు మాత్రమే వుంటాయి. ఈ మేరకు తాము అంగీకారానికి వచ్చినట్లు వారి తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టుకు తెలపగా, ధర్మాసనం అందుకు సమ్మతించింది. దీంతో విరిమద్య వున్న పవిత్ర బంధానికి కూడా చెల్లుచీటి అయ్యింది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bollywood  karishma kapoor  sunjay kapur  divorce  supreme court  amicable  

Other Articles