SS Rajamouli | Oopiri | Tweets | Review | Nagarjuna

Ss rajamouli tweets on oopiri

SS Rajamouli Comments on Oopiri, SS Rajamouli tweets on Oopiri, Oopiri public talk, Oopiri reviews, Oopiri collections, Oopiri rating, Oopiri, Thozha

SS Rajamouli tweets on Oopiri Director Vamsi paidipally latest hit film Oopiri. This film released today and gets positive talk.

వంశీని తక్కువ అంచనా వేసిన జక్కన్న

Posted: 03/25/2016 06:08 PM IST
Ss rajamouli tweets on oopiri

‘మున్నా’, ‘బృందావనం’, ఎవడు’ వంటి హిట్ చిత్రాల తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘ఊపిరి’. ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళం భాషలలో గ్రాండ్ గా విడుదలయ్యింది. నాగార్జున, కార్తీ, తమన్నా ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని, విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది.

ఈ సినిమాను చూసిన పలువురు సినీప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. కానీ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి మాత్రం తన తప్పును తెలుసుకున్నానంటూ చెప్పుకొచ్చాడు. నా ఫెవరెట్ సినిమాల్లో ‘ఇంటచబుల్స్’ ఒకటి. నిజానికి వంశీ ఈ ప్రాజెక్ట్ డీల్ చేయలేడని అనుకున్నాను. కానీ థ్యాంక్స్ వంశీ.. నేను తప్పు అని నిరూపించవు. భారతీయులకు తగ్గట్టుగా ఈ సినిమాను నువ్వు మార్చిన తీరు సినిమా స్థాయిని పెంచింది. కార్తీ చాలా బాగా చేశాడు. నాగార్జున గారు నిజమైన పాత్ బ్రేకర్. నిర్మాత పివి గారికి, యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు. ఊపిరి మిమ్మల్ని చాలా కాలం పాటు వెంటాడే నిజమైన ఎంటర్టైనర్. డోంట్ మిస్ ఇట్ అంటూ ట్వీట్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Oopiri  SS Rajamouli  Vamsi Paidipally  Tweets  Reviews  

Other Articles