Sampoornesh Babu | Angry | KRK | Pawan kalyan | tweets

Sampoornesh babu angry tweets on krk

Sampoornesh Babu Angry on KRK, Sampoornesh Babu tweets on KRK, Sampoornesh Babu tweets, Sampoornesh Babu attack on krk, Sampoornesh Babu vs KRK, KRK comments on pspk, Sampoornesh Babu tweets, pawan kalyan

Sampoornesh Babu Angry tweets on KRK: Burning star Sampoornesh Babu Angry tweets on bollywood actor KRK. Sampoornesh babu comments on krk.

కమల్ తుప్పురేగ్గొడుతున్న పవర్ ఫ్యాన్స్

Posted: 03/18/2016 06:16 PM IST
Sampoornesh babu angry tweets on krk

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ వున్న విషయం తెలిసిందే. అలాంటి పవన్ కళ్యాణ్ కు అభిమానులు ఊహించని రేంజులో వున్న విషయం ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. సినిమాల పరంగా కాకుండా కేవలం తన వ్యక్తిత్వం, పట్టుదల, నిజాయితీ, అహింస, సమాజసేవ వంటి పలు వ్యక్తిగత అంశాలను నచ్చి, మెచ్చి ప్రపంచ వ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను దక్కించుకున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.

మరి అలాంటి పవన్ కళ్యాణ్ గురించి ఎవరైనా తప్పుడు కూతలు కూస్తుంటే అభిమానులు ఊరుకుంటారా చెప్పండి. చేతికి, ఒంటికి తెలియకుండానే నోటితోనే చెప్పుతో కొట్టినట్లుగా సమాధానమిస్తారు. మాములుగా పవన్ కళ్యాణ్ ఎవరితో కూడా వాగ్విదం పెట్టుకోడు. అలాంటి పవన్ కళ్యాణ్ పై అనవసరంగా చెత్త కామెంట్లు చేస్తుంటే అభిమానులు ఎందుకు ఊరుకుంటారు చెప్పండి. అందుకే బాగా నోటిదురుసు ప్రదర్శించిన ఓ బాలీవుడ్ వ్యక్తికి పవన్ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో బుద్ధిచెప్పారు.

పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రం తెలుగుతో పాటు హిందీలో కూడా విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్లను ఇటీవలే విడుదల చేసారు. ఈ పోస్టర్లు, టీజర్లకు భారీ రెస్పాన్స్ వస్తోంది. అలాగే బాలీవుడ్ సినీ సెలబ్రెటీలు సైతం ‘సర్దార్’పై ప్రశంసలు అందిస్తున్నారు. అలాంటి ‘సర్దార్’ సినిమా మరియు పవన్ కళ్యాణ్ పై బాలీవుడ్ కమెడియన్ కమాల్ ఖాన్ వివాదాస్పద కామెంట్లు చేసాడు.

కమల్ ఖాన్ ‘సర్దార్’ పోస్టర్ మరియు పవన్ కళ్యాణ్ పై చెత్త కామెంట్లు చేయడంతో... పవన్ ఫ్యాన్స్ కమల్ ఖాన్ పై ట్విట్టర్ లో తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అంతటితో ఆగకుండా కమల్ మళ్లీ తన నోటిదురుసును ప్రదర్శిస్తూ.... ‘పవన్ సీ గ్రేడ్ హీరో అంటూనే... ఫ్యాన్స్ తనపై ఎటాకింగ్ ఆపాలని ట్విట్టర్‌లో రాసుకొచ్చాడు. నాపై మీరు ఎంత విరుచుకుపడితే.. తన పాపులార్టీ అంత పెరుగుతుంది’ అంటూ తన ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు.

పవన్ కళ్యాణ్ కు వున్న వీరాభిమానులలో టాలీవుడ్ నటుడు సంపూర్ణేష్ బాబు ఒకడు. అలాంటిది తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ పై ఎవరో నోటికొచ్చినట్లుగా కామెంట్లు చేస్తుంటే సహించలేక.... కమల్ ఖాన్ పై సంపూ తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. ‘అవును...అతను(పవన్) కార్టూన్, బ్యాట్‌మెన్ మాదిరి... నైస్ మీటింగ్ యూ స్నూపీ’ అంటూ ట్వీట్ చేశాడు. కేవలం సంపూర్నేష్ మాత్రమే కాకుండా చాలా మంది అభిమానులు కూడా కమల్ ఖాన్ పై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సౌత్ లోకి వచ్చి ఇలాంటి కామెంట్లు చేయమంటూ కమల్ కు వార్నింగ్ లు ఇస్తున్నారు పవన్ అభిమానులు. మరి ఇప్పటికైనా కమల్ తన నోటి దురుసును తగ్గించుకుంటాడో లేక పవన్ అభిమానుల ఆగ్రహానికి గురవుతాడో భవిష్యత్తులోనే తెలియనుంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan kalyan  KRK  Sampoornesh babu  tweets  Sardaar Gabbarsingh  stills  

Other Articles