SS Thaman Music Copy Cat Yet Again

Ss thaman copy cat yet again

Allu Arjun, SS Thaman, Sarainodu, Allu Arjuns Sarainodu teaser, Allu Arjun with Boyapati Sreenu

Tollywood Music Composer SS Thaman Proved Out his Copy Cat Skills Yet Again. For Allu Arjuns sarainodu he composed hollywood cinema background score.

అల్లు అర్జున్ సినిమాలో థమన్ కాపీ మ్యూజిక్

Posted: 02/19/2016 10:53 AM IST
Ss thaman copy cat yet again

తెలుగు మ్యూజిక్ డైరెక్టర్లలో కాపీ మాస్టర్ గా పేరున్న థమన్ మరోసారి విమర్శలపాలవుతున్నాడు. అల్లు అర్జున్, బోయపాటి శీను దర్శకత్వంలో వస్తున్న సరైనోడు సినిమా టీజర్ నిన్న రిలీజ్ అయింది. అల్లు అర్జున్ లుక్ పరంగా సూపర్ గా కనిపించగా... బోయపాటి మరోసారి స్ర్కీన్ మీద పవర్ ప్యాక్ తో అలరించారు. అయితే టీజర్ లో అల్లు అర్జున్ అప్పీయరెన్స్ కు తోడు థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరింది. అయితే అందరూ థమన్ ను మెచ్చుకునేలోపు అసలు విషయం బయటకు వచ్చింది. ధమన్ అందించిన మ్యూజిక్ కాపీ అని ప్రూఫ్ తో చూపిస్తున్నారు.

హాలీవుడ్ సినిమా ట్రాన్స్ పోర్టర్ 3 సినిమా ట్రైలర్ లో ఉన్న బ్యాగ్రౌండ్ స్కోర్ ను కాపీ చేసి అల్లు అర్జున్ సరైనోడుకు అందించాడు. అయితే దీనిలో కొన్ని మార్పులు చేసిన థమన్ మరోసారి కాపీ స్కిల్ ను ప్రదర్శించాడు. గతంలో కూడా థమన్ ఇలాగే కాపీ మ్యూజిక్ ను అందించాడు. అంతకు ముందు డిక్టేటర్, రామ్ చేసిన పండగచేస్కో సినిమాల్లో వేరే ఇండస్ర్టీలో హిట్ అయిన మ్యూజిక్ ట్రాక్ లను అదించడం చర్చనీయాంశంగా మారింది. అయితే థమన్ మ్యూజిక్ ను పక్కన పెడితే సరైనోడు టీజర్ మాత్రం అదిరిపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles