Shruthi Hassan support to Puli Movie Producers

Shruthi hassan support to puli movie producers

Shruthi Hassan support to Puli Producers, Shruthi Hassan support to Puli, Shruthi Hassan helps, Shruthi Hassan latest news, Shruthi Hassan stills, Shruthi Hassan movies, Shruthi Hassan movie news, Shruthi Hassan

Shruthi Hassan support to Puli Movie Producers: kollywood star heroine Shruthi Hassan support to Puli Producers. Vijay, Shruti haasan, hansika, stills

‘పులి’ చెక్ తిరిగిచ్చేసిన శృతిహాసన్

Posted: 11/13/2015 05:54 PM IST
Shruthi hassan support to puli movie producers

తమిళంలో భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘పులి’ చిత్రం ఇటీవలే తమిళం, తెలుగు భాషలలో విడుదలై, ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. ప్రముఖ దర్శకుడు చింబుదేవన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో తమిళ స్టార్ హీరో ఇలయథలపతి విజయ్ హీరోగా, అందాల భామలు శృతిహాసన్, హన్సికలు హీరోయిన్లుగా నటించారు.

అలాగే బాలీవుడ్ నటి శ్రీదేవి కపూర్, కన్నడ స్టార్ హీరో సుదీప్, తమిళ నటుడు ప్రభు తదితరులు ప్రధాన పాత్రలలో నటించారు. సోషియో ఫాంటసీ తరహాలో రూపొందిన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మాతకు చాలా నష్టం రావడంతో ఇందులో నటించిన కొంతమంది తారలు నిర్మాత నష్టానికి అండగా నిలుస్తున్నారు.

ఇందులో హీరోయిన్ గా నటించిన శృతిహాసన్ నిర్మాతకు తనవంతు సహాయాన్ని అందిస్తోంది. ఈ సినిమా కోసం శృతిహాసన్ అందుకున్న 20 లక్షల రూపాయల చెక్ ను తిరిగి నిర్మాతకే పంపించి వేసింది. సుదీప్ కూడా తనకు వచ్చిన చివరి చెక్ ను నిర్మాతకు తిరిగి పంపించేసాడు. ఇక హీరో విజయ్ కూడా నిర్మాతకు కలిగిన నష్ట తీవ్రతను తెలుసుకొని, తనవంతు సహాయ సహకారాలను అందించడానికి సిద్ధమవుతున్నారు. మొత్తానికి కలెక్షన్లతో గర్జిస్తుందని భావించిన ‘పులి’ నష్టాల బాట పట్టింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shruthi Hassan  Puli  Producers  Helps  stills  

Other Articles