New Twist on chiranjeevis 150th film

New twist on chiranjeevis 150th film

Chiranjeevi, Chiranjeevi News, Chiranjeevi, 150th film Chiranjeevi updates, Chiranjeevi News,, Chiranjeevi, 150th film news, Chiranjeevi, 150th film updates, VV Vinayak, Puri Jaganath

New twist on Mega star chiranjeevis 150the film. After Brucelee film, he wanted to associate with Puri jaganath but its not worked. After Puri Jaganath chiranjeevi planed to cinema with VV Vinayak.

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాపై కొత్త ట్విస్ట్

Posted: 11/07/2015 03:46 PM IST
New twist on chiranjeevis 150th film

చిరంజీవి 150 సినిమా ఎప్పుడు.. ఎప్పుడు అన్న దానికి సమాధానం ప్రస్తుతానికి రావడం లేదు. తెలుగు ఇండస్ట్రీలో చిరు సినిమా ఎప్పుడు అన్న ప్రశ్న మిలియన్ డాలర్ల ప్రశ్న అని అనుకునే వారు కూడా ఉన్నారు. అయితే ఇటీవల 'బ్రూస్‌లీ ద ఫైటర్‌' చిత్రంతో ప్రేక్షకుల ముందు కొచ్చారు చిరంజీవి. ఆయన నటించబోయే 150వ చిత్రం తాజాగా మరో కొత్త మలుపు తిరిగిందని సమాచారం. తొలుత పూరీజగన్నాథ్‌తో 'ఆటోజానీ' చిత్రాన్ని చేసేందుకు చిరంజీవి ఆసక్తి చూపించిన సంగతి తెలిసిందే. అయితే ఆ కథలో సెకండాఫ్ చిరంజీవికి నచ్చకపోవడంతో ఆ ప్రాజెక్ట్‌కి ఫుల్‌స్టాప్‌ పడింది. తర్వాత వి.వి. వినాయక్‌ దర్శకత్వం లో తమిళంలో ఘనవిజయం సాధించిన విజయ్‌ 'కత్తి' చిత్రాన్ని రీమేక్‌ చేస్తున్నారనే వార్తలు బాగా హల్‌చల్‌ చేశాయి.

అయితే తాజాగా ఈ వార్తకి కూడా బ్రేక్‌పడి చిరంజీవి 150వ సినిమాకి సంబంధించి సరికొత్త విషయం వెలుగులోకి వచ్చింది. రాజ్‌కుమార్‌ హిరానీ 'మున్నాభాయ్‌' సిరీస్‌లో భాగంగా మరో చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్న సంగతి విదితమే. హిందీతో పాటు తెలుగులో కూడా ఆ చిత్రాన్ని హిరానీ చేసేందుకు సుముఖంగా ఉన్నారట. తెలుగులో చిరంజీవితో ఈ ప్రాజెక్ట్‌ ఉండొచ్చని తెలుస్తోంది. లేదా కథ మాత్రమే తీసుకుని తెలుగు దర్శకులతో ఈ సినిమాని చిరంజీవి చేసే అవకాశముందని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles