Ravi kishan | Daughter | missing | case

Actor ravi kishan daughter missing case

Actor Ravi kishan Daughter missed, Actor Ravi kishan Daughter missing case, Ravi kishan daughter missing, Ravi kishan police complaint, Ravi kishan police case, Ravi kishan latest news, Ravi kishan daughter, Ravi kishan

Actor Ravi kishan Daughter missing case: Bhojpuri Actor Ravi kishan has filled a missing complaint of his 19 years old Daughter.

‘రేసుగుర్రం’ విలన్ రవికిషన్ కూతురు మిస్సింగ్

Posted: 10/16/2015 01:43 PM IST
Actor ravi kishan daughter missing case

‘రేసుగుర్రం’ సినిమాలో అల్లు అర్జున్ కు విలన్ పాత్రలో నటించిన భోజ్ పురి నటుడు రవికిషన్ కూతురు కనిపించడంలేదు. రవికిషన్ తన 19సంవత్సరాల కూతురు కనపించడంలేదని పోలీసులకు కంప్లైంట్ చేసారు.

ఈ విషయంపై డిసిపీ ధనుంజయ్ కులకర్ణీ మాట్లాడుతూ... బంగూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కొద్దిరోజుల క్రితం రవికిషన్ ఇచ్చిన మిస్సింగ్ కేస్ ను ఫైల్ చేసాం. ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నామని చెప్పుకొచ్చారు.

అయితే రవికిషన్ ఇలా కనబడకుండా వెళ్లిపోవడం ఇదేమి మొదటిసారి కాదు. గతంలో కూడా ఓ సారి ఇలాగే కనిపించకుండా పోయిందని పోలీసులు చెబుతున్నారు. ఈ విషయంపై స్పందించడానికి రవికిషన్ కూడా మీడియాకు అందుబాటులో లేరు. ప్రస్తుతం తన కూతురు మిస్ అయ్యిందనే తీవ్రంగా టెన్షన్ పడుతున్నట్లుగా తెలిసింది.

రవికిషన్ కు భోజ్ పురిలోనే కాకుండా తెలుగులో వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇటీవలే రవితేజ హీరోగా నటించిన ‘కిక్2’ సినిమాలో విలన్ గా ‘సోలమాన్ సింగ్ ఠాగూర్’ పాత్రలో అదరగొట్టాడు. మరి రవికిషన్ కూతురు ఎక్కడికెళ్లిందో, అసలు ఏం జరిగిందో అనే విషయాలు త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ravi kishan  Daughter  missing  case  police complaint  news  

Other Articles