Director Teja | Comments | interview | Mahesh Babu | Srimanthudu

Director teja sensational comments on srimanthudu film

Director Teja Sensational comments on Srimanthudu Film, Director Teja comments on Srimanthudu Film, Director Teja comments on Adopted villages, Director Teja comments on mahesh, Director Teja latest news, Director Teja movies, Director Teja interviews, Director Teja

Director Teja Sensational comments on Srimanthudu Film: Director Teja Upcoming film Hora Hori release on 11 sep. Teja Sensational comments on Mahesh Babu`s Srimanthudu Film.

శ్రీమంతుడుపై తేజ ఘాటు కామెంట్లు

Posted: 09/10/2015 02:18 PM IST
Director teja sensational comments on srimanthudu film

టాలీవుడ్ స్టార్ హీరో ప్రిన్స్ మహేష్ బాబుపై దర్శకుడు తేజ పరోక్షంగా ఘాటు కామెంట్లు చేసారు. మహేష్ బాబు నటించిన ‘శ్రీమంతుడు’ సినిమా ఇటీవలే విడుదలై మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. తమ సొంత ఊరును తామే బాగుచేసుకోవాలనే మంచి నేపథ్యంతో రూపొందిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంటుంది.

అందులో భాగంగానే ఈ సినిమాను ఆదర్శంగా తీసుకొని చాలా మంది ఊర్లను దత్తత తీసుకోవడానికి ముందుకొస్తున్నారు. అయితే ఈ విషయంపై దర్శకుడు తేజ ఘాటుగా స్పందించారు. ప్రస్తుతం తేజ దర్శకత్వం వహించిన ‘హోరా హోరీ’ చిత్రం రేపు(సెప్టెంబర్11) ప్రేక్షకుల ముందుకొస్తుంది.

ఈ సంధర్భంగా ఈ చిత్ర ప్రమోషన్స్ కార్యక్రమంలో ఇంటర్వ్యూలో ఊర్ల దత్తత గురించి మాట్లాడుతూ... ఇన్ కమ్ టాక్స్ తగ్గించుకోవడానికే గ్రామాలను దత్తత తీసుకుంటున్నారని తేజ ఘాటుగా కామెంట్లు చేసారు. దీంతో తేజపై మహేష్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఏ స్టార్ హీరో కూడా అవకాశం ఇవ్వని తనకు తమ హీరో మహేష్ ‘నిజం’ సినిమాతో అవకాశం ఇచ్చాడని, అలాంటి తమ హీరోను కించపరిచేలా మాట్లాడవద్దని, అంతేకాకుండా టాలెంట్ వుండి కూడా సినిమాలు చేయలేని పరిస్థితిలో తేజ వున్నాడంటూ మహేష్ అభిమానులు భారీ ఎత్తున సెటైర్లు వేస్తున్నారు.

మరి ఈ వివాదం ఇంకెంత దూరం వెళుతుందో చూడాలి. ‘హోరా హోరీ’ ఆడియో వేడుకలో కూడా ప్రస్తుతం వస్తున్న సినిమాలపై తేజ భారీగా విమర్శలు చేసారు. మరి ‘హోరా హోరీ’ సినిమా విడుదల సమయంలో ఇలాంటి కామెంట్లు చేయడం వల్ల సినిమాకు ఆర్థికంగా నష్టాలొచ్చే అవకాశాలున్నట్లుగా సినీవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Director Teja  Comments  interview  Mahesh Babu  Srimanthudu  

Other Articles