Krish talks about Kanche Movie Budjet

Director krish talks about kanche movie budjet

Director Krish Clarifies on Kanche Movie Budjet, Kanche Movie Budjet high, Kanche Movie Budjet, Kanche Movie news, Kanche Movie stills, Kanche Movie trailer, Kanche Movie updates, Kanche Movie release date, Varun Tej latest news, Varun Tej movies, Varun Tej movie news, Varun Tej

Director Krish talks about Kanche Movie Budjet: Varun tej upcoming film Kanche. Krish Director. High budjet for Kanche movie. directed by Krish. produced by Y Rajeev Reddy & J Sai Babu. music by Chirantan Bhat. Starring Varun Tej, Pragya

కంచెలు దాటిన ‘కంచె’ బడ్జెట్... క్లారిటీ ఇచ్చిన క్రిష్!

Posted: 09/05/2015 01:48 PM IST
Director krish talks about kanche movie budjet

ఇప్పుడున్న స్టార్ హీరోలకు భారీ బడ్జెట్ పెట్టలేక చాలా మంది దర్శకనిర్మాతలు కొత్త నటులను హీరోలుగా పరిచయం చేస్తున్నారు. కానీ కొత్త హీరోకు కూడా భారీ బడ్జెట్ ను పెట్టి సాహసం చేస్తున్నారు దర్శకుడు క్రిష్. ప్రస్తుతం ఈ విషయం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా తెలుగు చిత్రం ‘కంచె’. వరుణ్ తేజ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం రెండవ ప్రపంచ యుద్ధం నేపథ్యంలో రూపొందుతోంది. అప్పటి కాలం నాటి వేషధారణ, అలాగే యుద్ధ సమయంలో ట్యాంకర్లు, గన్స్ వాడినట్లుగా చూపించారు. దీంతో ఈ సినిమాకు ఎంత బడ్జెట్ అయ్యిందోనని అందరిలో ఆసక్తి నెలకొన్నది.

అయితే ఇటీవలే దర్శకుడు క్రిష్ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ఈ సినిమాను 21 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నామని, ఈ సినిమా కోసం ఖర్చు చేసిన ప్రతి పైసా తెరపై కనిపిస్తుందని క్రిష్ చెప్పుకొచ్చాడు.

‘ముకుంద’ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత వరుణ్ రెండవ సినిమాకు ఇంత భారీ బడ్జెట్ పెట్టి సినిమా తీయడం అందరిలో ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు భారీ రెస్పాన్స్ వస్తుండటంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ చిత్రాన్ని అక్టోబర్ 2వ తేదిన విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Varun Tej  Kanche  Krish  Budjet  Trailer  Stills  

Other Articles