ఇప్పుడున్న హీరోయిన్లలో చాలా సెక్సీగా, ముద్దుగా, బొద్దుగా ఎవరున్నారు అని ఆలోచిస్తే.. అందరినోట కూడా ‘నమిత’ అనే పేరు వినిపిస్తుంది. సౌత్ ఇండస్ట్రీలో నమిత బొద్దు హాట్ హీరోయిన్ గా పిచ్చెక్కించేస్తోంది. ఈ అమ్మడు బొద్దుగా వున్నప్పుడు తెగ సినిమా ఆఫర్లు వచ్చేవి. ఆ ఆఫర్లన్నీ కూడా హాట్ హాట్ పాత్రలకు సంబంధించినవే కావడం విశేషం.
కానీ ఈ అమ్మడు కాస్త స్లిమ్ గా మారిపోయి అందరికి షాకిస్తుంది. అయితే ఈ అమ్మడికి స్లిమ్ గా మారినంత తేలికగా ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీకి వస్తానని ధీమాను వ్యక్తం చేస్తుంది. గతకొద్ది కాలంగా నమిత రాజకీయాల్లోకి రాబోతుందంటూ వార్తలొస్తున్నాయి. అయితే తాజాగా తన రాజకీయ అరంగేట్రం గురించి నమిత ఓ క్లారిటీ ఇచ్చేసింది.
నమిత మాట్లాడుతూ.. త్వరలోనే రాజకీయాల్లోకి వస్తాను. నాకు ఇంత గుర్తింపును ఇచ్చింది తమిళ ప్రేక్షకులే. అందుకే వారికి తనవంతు సేవను చేయడానికి రాజకీయాల్లోకి వస్తాను. పలు రాజకీయ పార్టీల నుంచి నాకు ఆహ్వానం అందింది. అయితే వారి వివరాలు ఇప్పుడే చెప్పను. ఇపుడు స్లిమ్ గా మారి మీకందరికి ఎలా షాకిచ్చానో.. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో గెలిచి అందరికి షాకివ్వబోతున్నాను అని తెలిపింది.
అంతే కాకుండా తాను బరువు తగ్గడం అసాధ్యమని ఎంతమంది చెప్పినా కూడా.. బరువు తగ్గి ఇలా స్లిమ్ గా మారి సుసాధ్యం చేసానో... అలాగే రాజకీయాల్లో కూడా అనుకున్నది సాధించి తీరుతాను అంటూ నమిత స్పష్టం చేసింది. కానీ ఈ అమ్మడి మాటలకు కోలీవుడ్ జనాలు భారీగానే కామెంట్లు చేస్తున్నారు.
బరువు తగ్గినంత ఈజీగా రాజకీయాల్లో గెలవలేవు అంటూ నమితపై కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి ఈ అమ్మడు ఇంత నమ్మకంతో ఎలా చెబుతోంది? అసలు ఈ అమ్మడి వెనుక ఏ పార్టీ వుండబోతుంది? అనే సందేహాలు కోలీవుడ్ జనాలకు కలుగుతున్నాయి. మరి నమిత రాజకీయ అరంగేట్రం ఎలా వుండబోతుంతో భవిష్యత్తులో తెలియనుంది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more