Katrina Kaif Has Given Green Signal To Director Shankar To Act In Robo Sequel Movie | Rajnikanth | Chiyan Vikram

Katrina kaif green signal director shankar robo sequel rajnikanth chiyan vikram

katrina kaif, rajnikanth, katrina kaif latest news, katrina gossips, katrina updates, katrina robo 2 movie, katrina robo sequel, director shankar, shankar latest movie, shankar robo 2 movie, rajnikanth, rajnikanth robo 2 movie, chiyan vikram

Katrina Kaif Green Signal Director Shankar Robo Sequel Rajnikanth Chiyan Vikram : According To The Film Industry Sources The News Going Viral That Katrina Kaif Has Given Green Signal To Director Shankar To Act In Robo Sequel Movie In Which Rajnikanth Playing Lead Role.

ఆ దర్శకుడికి కత్రినా కన్ను కొట్టిందటగా..!

Posted: 08/29/2015 12:50 PM IST
Katrina kaif green signal director shankar robo sequel rajnikanth chiyan vikram

సెక్సీ బ్యూటీ కత్రినా కైఫ్ కి ఇండియన్ ఇండస్ట్రీలో ఎంత డిమాండ్ వుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఓ బూతు సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె.. తన ఒంపుసొంపు వయ్యారాలతో అందరినీ ఆకట్టుకుంటూ అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. ప్రస్తుతం ఈమె నటించే సినిమాలన్నింటిలోనూ ఆమె పాత్ర చాలా ప్రత్యేకంగా వుంటుంది కూడా! సాధారణ సినిమాల్లో కేవలం హీరోయిన్ పాత్రలు పోషిస్తే అంతగా ప్రాధాన్యత వుండదని తెలుసుకున్న ఈమె.. ఆ తరహా పాత్రలకే గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వస్తోంది. ఇప్పుడు తాజాగా మరో ముఖ్యమైన పాత్ర ఈమె దరికి చేరడంతో.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం.

దేశంలో గర్వించదగ్గ దర్శకుల్లో ఒకరైన శంకర్ ‘రోబో-2’ చిత్రాన్ని రూపొందించేందుకు తీవ్ర సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈయన తెరకెక్కించిన ‘ఐ’ చిత్రం కలెక్షన్ల పరంగా సక్సెస్ అయినా.. సినిమా మాత్రం ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఆ ముద్ర నుంచి వెంటనే బయటపడేందుకు ఆయన ‘రోబో’ సీక్వెల్ ని తెరకెక్కించేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. 300 కోట్ల భారీ బడ్జెట్టుతో నిర్మితమవుతున్న ఈ చిత్రంలో రజనీకాంత్ హీరోగా నటిస్తుండగా.. ఇంకా భారీ తారాగణాన్ని ఆయన ఎంచుకుంటున్నాడు. ఈ క్రమంలోనే పలువురు తారలను పరిశీలించిన అనంతరం కత్రినా కైఫ్ ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. హీరోయిన్ వేట కోసం గతకొన్నాళ్ల నుంచి ముంబైలో వుండి చర్చలు కొనసాగించిన ఆయన.. ఈ క్రమంలోనే కత్రినాను సంప్రదించారు. తనకి ఈ భారీ ఆఫర్ రావడంతో ఆమె వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు తెలిసింది.

ఇక ఈ చిత్రంలో రజనీకి విలన్ గా ఆమీర్ ఖాన్ తోపాటు పలువురు ప్రముఖుల పేర్లూ తెరమీదకొచ్చాయి. కానీ.. చివరగా విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ నెగెటివ్ రోల్ లో నటించనున్నట్లు కోలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. ఈ చిత్రానికి సంబంధించి ఇంకా అధికారిక వార్తలు వెలువడాల్సి వుంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : katrina kaif  rajnikanth  robo 2  director shankar  

Other Articles

Today on Telugu Wishesh