Ram Charan Movie Latest Shooting Updates

Ram charan movie latest shooting updates

Ram Charan Movie Shooting in hyderabad, Ram Charan upcoming film, Ram Charan movie news, Ram Charan movie updates, Ram Charan film news, Ram Charan movie stills, Ram Charan latest news, Ram Charan latest updates, Ram Charan

Ram Charan Movie Latest Shooting Updates: Mega Powerstar Ram Charan tej upcoming film under srinuvaitla direction. DVV Danayya producer. Rakul preet singh heroine. Thaman music.

భాగ్యనగరంలో సందడి చేస్తున్న రాంచరణ్ బ్రూస్ లీ

Posted: 08/14/2015 09:57 AM IST
Ram charan movie latest shooting updates

మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా ప్రముఖ దర్శకుడు శ్రీనువైట్ల దర్శకత్వంలో హిట్ చిత్రాల నిర్మాత దానయ్య డి.వి.వి. ‘డి.వి.వి. ఎంటర్టైన్మెంట్స్ ఎల్ ఎల్ పి.’ పతాకం పై శ్రీమతి డి. పార్వతి సమర్పణలో నిర్మిస్తున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం ఈరోజు నుంచి హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది. రాం చరణ్ తో పాటు ఇతర ప్రధాన తారాగణం అంతా పాల్గొనగా టాకీ పార్ట్ కు సంబందించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలిపారు నిర్మాత దానయ్య డి.వి.వి.

గత నెల 27 నుంచి బ్యాంకాక్ లో జరిగిన షూటింగ్ లో రాం చరణ్, రకుల్ ప్రీత్ సింగ్ తో పాటు ఇతర ప్రధాన తారాగణం అంతా పాల్గొనగా బ్యాంకాక్ లో భారీ పతాక సన్నివేశాలను, భారీ వ్యయంతో చిత్రీకరించామని తెలిపారు. అలాగే టాకీ పార్ట్ కు సంబందించిన సన్నివేశాలను కూడా చిత్రీకరించినట్లు తెలిపారు. బ్యాంకాక్ లో చిత్రీకరించిన సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయని తెలిపారు నిర్మాత దానయ్య.

విజయదశమి కానుకగా చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ చిత్రానికి సంభందించి ఇంకా ఎలాంటి పేరును నిర్ణయించలేదని తెలిపారు. నాయక్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఈ సినిమా నిర్మించటం ఎంతో ఆనందంగా ఉంది. భారీ తారాగణం తో పాటు, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రం ముస్తాబౌతుందని అన్నారు.

ఈ సందర్భంగా మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్’ తో తాను రూపొందిస్తున్న ఈ చిత్రం గురించి దర్శకుడు ‘శ్రీను వైట్ల’ మాట్లాడుతూ ” ఫ్యామిలి ఎంటర్టైనర్ విత్ యాక్షన్ ‘కథా చిత్రం గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ చిత్రానికి కథ : కోన వెంకట్, గోపి మోహన్, మాటలు: కోన వెంకట్, రచనా సహకారం: ఉపేంద్ర మాధవ్, ప్రవీణ్...  నిర్మాత : దానయ్య డి.వి.వి. మూలకథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం : శ్రీను వైట్ల.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Charan  Rakul preet singh  Movie News  stills  

Other Articles