Ram Charan Trujet Airlines launch event

Ram charan trujet airlines launch event

Ram Charan Trujet Airlines launched, Ram Charan Airlines To Fly, Ram Charan Turbo Megha Airways, Ram Charan latest news, Ram Charan movie news, Ram Charan movie updates, Ram Charan stills, Ram Charan airlines, Ram Charan news, Ram Charan

Ram Charan Trujet Airlines launch event: Tollywood Actor Ram Charan has launched Trujet Airlines. Ram Charan has ventured in to airways business by investing a decent percentage in Turbo Megha Airways.

ప్రారంభమైన రాంచరణ్ ట్రూజెట్ విమానయాన సేవలు

Posted: 07/13/2015 12:02 PM IST
Ram charan trujet airlines launch event

మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ ఇటీవలే బిజినెస్ లోకి అడుగెట్టి, టర్బోమేఘా ఏవియేషన్ సంస్థను ప్రారంభించారు. ఇందులో రాంచరణ్ తన స్నేహితుడు ఉమేష్ తో కలిసి భాగస్వామిగా వున్నారు. ఈ ఎయిర్ వేస్ కు ‘ట్రూ జెట్’ అనే పేరును ఖరారు చేసారు.

ఈ ట్రూజెట్ విమాన సేవలు ఇటీవలే గ్రాండ్ గా ప్రారంభమయ్యాయి. శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు ఈ ట్రూజెట్ విమానంను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాంచరణ్, ఉమేష్, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కెటీఆర్, కేంద్ర కార్మిక శాఖమంత్రి బండారు దత్తాత్రేయ తదితరులు పాల్గొన్నారు.

తొలి విమానం హైదరాబాద్ నుంచి తిరుపతి బయలుదేరింది. అలాగే ప్రస్తుతం చరణ్ సినిమాల్లో కూడా బిజీగా వున్నాడు. శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.



Video Courtesy : iDream Filmnagar

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Charan  Trujet Airlines launch  Movie News  

Other Articles