Baahubali | Rajamouli | appreciates | mahesh babu comments

Baahubali rajamouli appreciates mahesh babu comments

Rajamouli appreciates mahesh babu comments, Rajamouli appreciates mahesh babu, Baahubali release date, Mahesh babu, Srimanthudu, Baahubali movie stills, Baahubali news, Baahubali, Baahubali posters, Baahubali stills, Baahubali trailers, Baahubali songs, Baahubali videos, Baahubali audio, Baahubali heroines, Baahubali teasers, Baahubali latest news, Baahubali latest stills, Baahubali latest updates, Baahubali movie details, Baahubali movie cast and crew, Baahubali movie latest posters, Baahubali posters, Baahubali, Prabhas, Baahubali Prabhas, Baahubali anushka, Tamannah, Prabhas, Anushka, Rana, Ramya krishna, Baahubali movie trailers, SS Rajamouli

Baahubali Rajamouli appreciates mahesh babu comments: SS Rajamouli latest film baahubali will be release on 10 july. Rajamouli appreciates mahesh babu comments for baahubali movie release.

మహేష్ బాబుపై రాజమౌళి ప్రశంసలు

Posted: 07/01/2015 06:43 PM IST
Baahubali rajamouli appreciates mahesh babu comments

మహేష్ బాబు ‘శ్రీమంతుడు’ చిత్రం షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావల్సింది. కానీ ‘బాహుబలి’ సినిమా విడుదలవుతుండటంతో ‘శ్రీమంతుడు’ చిత్ర విడుదలను వాయిదా వేసారు. దీంతో ‘శ్రీమంతుడు’ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మరింత వేగవంతం చేసి, మరింత పర్ఫెక్ట్ గా ‘శ్రీమంతుడు’ చిత్రాన్ని సిద్ధం చేస్తున్నారు.

మైత్రి మూవీస్ బ్యానర్లో ‘మిర్చి’ ఫేం దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ‘శ్రీమంతుడు’ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు. ఈ చిత్ర ఆడియోను జులై 18న విడుదల చేసి, సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ఆగష్టు 7న విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్ ప్రకటించారు. ‘బాహుబలి’ వంటి పెద్ద సినిమా విడుదలవుతున్నందువల్లే ‘శ్రీమంతుడు’ సినిమాను వాయిదా వేస్తున్నామని ‘శ్రీమంతుడు’ చిత్ర యూనిట్ చెప్పుకొచ్చారు.

అలాగే ఈ విషయంపై మహేష్ బాబు కూడా స్పందిస్తూ... ‘బాహుబలి’ లాంటి పెద్ద సినిమా మన తెలుగు ఇండస్ట్రీ నుంచి రావడం చాలా గర్వించదగ్గ విషయం. అందరిలాగే తాను కూడా ఈ సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నాని అన్నారు. ‘బాహుబలి’ వంటి సినిమా విడుదలవుతున్నపుడు దానికోసం వేరే సినిమాలు రెండు, మూడు వారాలు గ్యాప్ ఇస్తేనే బాగుంటుంది. అలా కాకుండా వెంటనే మరో సినిమా విడుదలైతే బాగోదు అని అన్నారు.

అంతే కాకుండా ‘బాహుబలి’ సినిమాకు ఏమన్నా అయితే ఆ ఎఫెక్ట్ మిగతా సినిమాలపై కూడా ప్రభావం చూపుతుంది కాబట్టి. అలాంటి పెద్ద సినిమాలకు మరో పెద్ద సినిమా గ్యాప్ ఇవ్వడమే మంచిదని అన్నారు. అలాగే ‘బాహుబలి’ సినిమా విడుదలై ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్టవ్వాలని కోరుకుంటున్నానని, అలాగే రాబోయే తన ‘శ్రీమంతుడు’ సినిమా కూడా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నట్లుగా మహేష్ తెలిపాడు.

మహేష్ స్పందించిన విధానంపై ‘బాహుబలి’ చిత్ర దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి సంతోషం వ్యక్తం చేసారు. ఈ సంధర్భంగా మహేష్ బాబును రాజమౌళి అభినందించారు. ‘బాహుబలి’ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఓ టీవి ఛానెల్ కు ఇచ్చిన మీడియా ఇంటర్వ్యూలో భాగంగా ‘బాహుబలి’ సినిమా విషయంలో మహేష్ స్పందించిన తీరుపై రాజమౌళి మాట్లాడుతూ... మహేష్ లాంటి పెద్ద స్టార్ హీరో ‘బాహుబలి’ కోసం తన సినిమాను వాయిదా వేసుకోవడం అనేది అభినందించదగ్గ విషయం. అలాగే ‘బాహుబలి’కి భయపడి ‘శ్రీమంతుడు’ చిత్రాన్ని వాయిదా వేశారా? అనే అనాలోచిత ప్రశ్నకు మహేష్ గారిచ్చిన సమాధానం ఆయన మంచితనాన్ని తెలియజేసింది. ఈ విషయంపై మహేష్ అంత కూల్ గా జెంటిల్ మెన్ గా సమాధానమివ్వడాన్ని నిజంగా అభినందించాల్సిందే అంటూ మహేష్ పై రాజమౌళి ప్రశంసలు కురిపించారు.

ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్, రానా, తమన్నా, అనుష్క ప్రధాన పాత్రలలో నటించారు. కీరవాణి సంగీతం అందించారు. భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘బాహుబలి’ చిత్రం జులై 10న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషలలో గ్రాండ్ గా విడుదల కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali  Mahesh babu  Rajamouli  Srimanthudu  

Other Articles