Stylish star Allu Arjun Rejects Rs.12 Crores Offer

Stylish star allu arjun rejects rs 12 crores offer

Allu arjun rejects, Allu arjun latest news, Allu arjun offers, Allu arjun dance offer, Allu arjun latest updates, Allu arjun stills, Allu arjun hot news, Allu arjun movie updates, Allu arjun stills, Allu arjun rejects huge amount, Allu arjun

Allu Arjun Rejects Rs.12 Crores US Offer: Stylish star Allu arjun has good craze these days in AP and also he is so popular with national wide ads.

పైసాలెన్ని ఇచ్చిన అలాంటి పనులు చేయనంటున్న బన్ని

Posted: 06/17/2015 09:50 AM IST
Stylish star allu arjun rejects rs 12 crores offer

బాలీవుడ్ లో జరిగే పలు కార్యక్రమాల్లో స్టార్ హీరో హీరోయిన్లు డాన్సులు చేస్తూ బాగానే రెమ్యునరేషన్ తీసుకుంటారనే విషయం తెలిసిందే. ఏదైనా ఈవెంట్స్, ప్రోగ్రామ్స్, అవార్డుల ఫంక్షన్లలో తారలు డాన్సులు చేసి, వారికి తగినంత పారితోషకం డిమాండ్ చేస్తుంటారు. బాలీవుడ్ లో అయితే స్టార్ హీరోలు షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, షాహిద్ కపూర్ లాంటి వాళ్లు కూడా స్టేజ్ షో పర్ఫార్మెన్స్ లు ఇస్తుంటారు. అందుకు తగ్గ భారీ పారితోషకాన్ని వారు తీసుకుంటూ వుంటారు.

కానీ తెలుగులో మాత్రం ఏ ఒక్క స్టార్ హీరో స్టేజ్ పై వచ్చి డాన్స్ చేయడానికి సిద్ధపడరు. కానీ తెలుగులో నటించే హీరోయిన్లు మాత్రం స్టేజ్ షోలలో పాల్గొంటారు. మరి టాలీవుడ్ హీరోలకు మోహమాటం ఎక్కువనో మరేంటో తెలియదు కానీ.. ఇప్పటి వరకు ఏ హీరో కూడా బాలీవుడ్ హీరోల వలే స్టేజ్ షో పర్ఫార్మెన్స్ లు ఇవ్వలేదు. కానీ తాజాగా వచ్చిన ఓ ఆఫర్ ను స్టైలిష్ స్టార్ వదిలేసుకున్నాడు.

అయితే తాజాగా టాలీవుడ్ స్టైలిష్ స్టార్ గా పేరు దక్కించుకున్న అల్లు అర్జున్ (బన్నీ)కి ముంబాయ్ కు చెందిన ఓ ఏజెన్సీ ద్వారా భారీ ఆఫర్ వచ్చింది. ఆ ఆఫర్ ఏంటంటే.. ఆ ఏజెన్సీ వారు అమెరికాలోని 5 నగరాల్లో డాన్స్ షోలు నిర్వహించనున్నారు. ఇది కేవలం ఓ పది రోజుల టూర్ మాత్రమే. ఇందులో పాల్గొనాలని సదరు ఏజెన్సీ వారు బన్నీని కోరారట. ఇందుకు బన్నీకి దాదాపు 12 కోట్ల రూపాయలను సదరు ఏజెన్సీ వారు ఆఫర్ చేసారని తెలిసింది.

కానీ ఈ భారీ ఆఫర్ ను బన్నీ సున్నితంగా తిరస్కరించాడట. ఇలాంటి వాటిపై తనకు ఆసక్తి లేదని బన్నీ ఈ ఆఫర్ ను వదులుకున్నాడు. ఈ విషయంపై బన్నీ సన్నిహితుడైన ప్రముఖ నిర్మాత బన్నీవాసు మాట్లాడుతూ...  అవును.. బన్నీని అమెరికాలో స్టేజ్ డాన్స్ పర్ఫార్మెన్స్ చేయడం కోసం సంప్రదించారు. కానీ బన్నీ ఇలాంటి వాటికి పూర్తిగా దూరం. అందుకే ఆ ఆఫర్ ను తిరస్కరించారు అని చెప్పుకొచ్చాడు. బన్ని తెలుగు సినిమాల్లో మాత్రమే చిందులేసి సితకొట్టేస్తాడన్నమాట. స్టేజ్ షోలు చేసి డబ్బులు సంపాదించే కన్నా, తనను అభిమానించే అభిమానుల కోసం సినిమాలతోనే అలరించడం నిజంగా గ్రేట్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allu arjun  Rejects  12 crores  US Offer  Dance  Stills  

Other Articles