Baahubali | Tamil Trailer Launch | Prabhas | Rajamouli

Baahubali tamil trailer launch in chennai

Baahubali Tamil Trailer Launch, Baahubali Trailer is Back, Baahubali inspired by mahabharata, Baahubali movie news, Baahubali trailer, Baahubali official trailer, Baahubali teaser, Baahubali latest trailers, Baahubali news, Baahubali movie updates, Baahubali stills, Baahubali

Baahubali Tamil Trailer Launch in chennai: bahubali the beginning tamil version trailer launched, prabhas, anushka, Rana, Tamanna acts in lead roles. SS Rajamouli direction, MM Keeravani Music.

చెన్నైలో బాహుబలి టీం సందడి...ప్రభాస్ కేక అంతే!

Posted: 06/06/2015 12:02 PM IST
Baahubali tamil trailer launch in chennai

తెలుగు సినీ ఇండస్ట్రీలోని ప్రస్తుత టాప్ 1 దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘బాహుబలి’. తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషలలో కూడా ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ మూడు భాషల వర్షెన్ లకు సంబంధించి ‘బాహుబలి - ది బిగినింగ్’ ట్రైలర్ ను విడుదల చేసారు. అన్ని భాషలలో కూడా అద్భుతమైన స్పందన వస్తుంది.

హిందీలో మళ్లీ ఓ ప్రెస్ మీట్ పెట్టి చిత్ర యూనిట్ అంతా పాల్గొని హిందీ ట్రైలర్ విడుదల చేసారు. అయితే నిన్న ఈ చిత్ర తమిళ వర్షెన్ కు సంబంధించిన ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని చెన్నైలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజమౌళి ప్రభాస్, రానా, తమన్నా, అనుష్క, నాజర్, సత్యరాజ్ లతో పాటు చిత్ర యూనిట్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి తమిళ నటులు సూర్య మరియు సుహాసిని మణిరత్నంలు వ్యాఖ్యతలు వ్యవహరించారు.

ఈ ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని తమిళంలో గ్రాండ్ గా నిర్వహించారు. త్వరలోనే ఆడియోను కూడా భారీ ఎత్తున విడుదల చేయడానికి ఇప్పటికే ఏర్పాట్లు కూడా ప్రారంభమైనట్లుగా తెలిసింది. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియోను త్వరలోనే విడుదల చేయనున్నారు.

ప్రభాస్, అనుష్క, తమన్నా, రానా ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్ర ట్రైలర్ ఇప్పటికే యూట్యూబ్ రికార్డులన్నీ బద్దలుకొట్టి కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది. భారీ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా నిర్మిస్తుంది. ఈ చిత్రాన్ని జులై 10న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషలలో భారీ ఎత్తున గ్రాండ్ లెవల్లో విడుదల చేయనున్నారు. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali  Tamil Trailer Launch  Prabhas  Rajamouli  

Other Articles