పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఛార్మి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘జ్యోతిలక్ష్మీ’. ఛార్మి సమర్పణలో సి.కె.ఎంటర్ టైన్మెంట్ ప్రై.లి., శ్రీశుభశ్వేత ఫిలిమ్స్ బ్యానర్ పై శ్వేతలానా, వరుణ్, తేజ్, సి.వి.రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ ట్రైలర్ ను ఇటీవలే ఛార్మి పుట్టినరోజు సంధర్భంగా విడుదల చేసారు.
ఎలాంటి అంచనాలు లేకుండా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడేలా చేసింది ఈ ట్రైలర్. ఇందులో ఛార్మి చాలా చక్కగా నటించింది. హాట్ హాట్ గానే కాకుండా పవర్ ఫుల్ లేడిగా కూడా సూపర్ అని అనిపిస్తోంది. ఈ ట్రైలర్ విడుదల సంధర్భంగా చిత్ర యూనిట్ మాట్లాడుతూ...
దర్శకుడు పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ.... ‘మల్లాది వెంకటకృష్ణమూర్తి రచించిన సుప్రసిద్ధ నవల మిసెస్ పరాంకుశం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాను. ఈ ట్రెండ్ కు తగినట్లుగా మార్పులు చేసి తీసాం. ఛార్మి మనసు పెట్టి ఈ సినిమా చేసింది. కళ్యాణ్ గారితో పనిచేయడం చాలా హ్యాపీగా వుంది. త్వరలోనే ఆడియో, సినిమా విడుదల వివరాలు తెలియజేస్తాం అని అన్నారు.
ఛార్మి మాట్లాడుతూ... పూరీగారు, ఆయన టీం ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేసారు. సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా వున్నాం. ఈ టీజర్ లో బుల్లెట్ రైడ్ చేసే సీన్ గురించి చాలా మంది అడుగుతున్నారు. నిజంగా ఆ సీన్ లో నేనే యాక్ట్ చేసారు. రియల్ గానే నేనే ఆ బుల్లెట్ ను రైడ్ చేసాను అని చెప్పుకొచ్చింది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more