Ram Charan is ready to join Srinu Vaitla latest directorial movie | Rakul preet Singh

Ram charan srinu vaitla rakul preet singh second schedule hyderabad jaika stunts

Ram Charan news, Ram Charan jaika stunts, Ram Charan bankok tour, Ram Charan gossips, Ram Charan movies, Ram Charan new movie, Ram Charan rakul preet, Ram Charan kriti karbanda, Ram Charan srinu vaitla, Ram Charan controversies

Ram Charan Srinu Vaitla Rakul preet Singh second schedule hyderabad Jaika Stunts : Mega power star ram charan tej is ready to join second schedule of his latest flick in hyderabad which is directing by srinu vaitla.

యాక్షన్ ఎపిసోడ్స్ కి డేట్ ఫిక్స్.. చక్కిలిగింతల్లో చెర్రీ రణరంగం!

Posted: 04/23/2015 10:22 AM IST
Ram charan srinu vaitla rakul preet singh second schedule hyderabad jaika stunts

ఇప్పటివరకు యాక్షన్ తరహా కథాచిత్రాలలో నటించి ఫ్యాన్స్ ని మెప్పించిన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్.. మాస్ హీరోగా ఓ ప్రత్యేక గుర్తింపు గడించాడు. అయితే.. ఇదే దారిలో నడిస్తే ఫ్యామిలీ ఆడియెన్స్ దూరమవుతానన్న అంశాన్ని గమనించిన చెర్రీ.. ‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రంతో ఆ ముద్రను చెరిపేసేందుకు ప్రయత్నించాడు. కానీ.. ఆ మూవీ అనుకున్నంత స్థాయిలో హిట్ సాధించలేకపోయింది. అందుకే.. ఈసారి ఆ రెండు అంశాలతోపాటు కామెడీ, ఎంటర్ టైన్ మెంట్లన్నింటినీ జోడించి మాస్, ఫ్యామిలీ ప్రేక్షకులను అలరించేందుకు సన్నద్ధమవుతున్నాడు.

ప్రస్తుతం చరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే! సెట్స్ పై వున్న ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఇక రెండో షెడ్యూల్ ని హైదరాబాద్ నగరంలో మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే నటీనటులపై కొన్ని సన్నీ వేషాలను షూట్ చేస్తున్నారు. ఈ సినిమాలో చరణ్ ఓ స్టంట్ మాస్టర్ పాత్రలో కనిపించనున్నాడు. అందుకోసమే అతడు స్పెషల్ గా బ్యాంకాక్ వెళ్లి, అక్కడ ఫేమస్ అయిన ‘ది మార్షల్ ఆర్ట్స్’ స్కూల్ లో ‘జైక’ స్టంట్స్ పైన ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. యాక్షన్ ఎపిసోడ్స్ లో కొత్తదనం చూపించడం కోసమే చెర్రీ ఇలా ప్రత్యేకంగా ఈ ట్రైనింగ్ తీసుకున్నట్లు సమాచారం! ఇక ఈ ట్రైనింగ్ ముగియడంతో చరణ్ సినిమా షూటింగ్ కోసం సిద్దమవుతున్నాడు.

ఈనెల 27వ తేదీ నుంచి చరణ్ ఈ మూవీ రెండో షెడ్యూల్ లో పాల్గొంటాడు. ఇన్నాళ్లూ ట్రైనింగ్ తీసుకున్న నేపథ్యంలో కాస్త రెస్ట్ తీసుకున్న అనంతరం షూటింగ్ లో పాల్గొననున్నాడని సన్నిహితవర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇక ఈ మూవీలో చెర్రీకి సిస్టర్ పాత్రలో కృతి కర్బంద నటిస్తుండగా.. అతని సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాత దానయ్య డివివి నిర్మిస్తున్న ఈ సినిమాను అక్టోబర్ 15న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Charan  Srinu vaitla  rakul preet singh  kriti karbanda  

Other Articles