Charmme | Injured | Jyothi lakshmi | Puri Jagannadh

Charmme injured in jyothilakshmi shooting

Charmme injured, Charmme jyothilakshmi movie news, Charmme latest news, Charmme movie news, Charmme movie updates, Charmme stills, Charmme hot stills, Charmme hot gossips, Charmme spicy stills, Charmme in jyothi lakshmi, Charmme

Charmme Injured in Jyothilakshmi Shooting: Tollywood actress Charmme upcoming movie Jyothilakshmi. Charmme Injured in Jyothilakshmi Movie Shooting in Goa. Puri Jagannadh Direction.

పూరీ జ్యోతిలక్ష్మీకి గాయాలు... ఛార్మి సేఫ్!

Posted: 04/13/2015 10:45 AM IST
Charmme injured in jyothilakshmi shooting

చేతికి గాజులు తొడిగి చేతకానోళ్ళయిపోయామా?
వంటింటి కుందేళ్ళలాగ వందేళ్ళయినా బతికేద్దామా..
ఆడోళ్ళం ఆడోళ్ళం మనం తోడేళ్ళతో ఉంటున్నామా
ప్రాణాలే తోడేస్తూవున్నా నోరుమూసుక్కూర్చుందామా?

అంటూ ఛార్మి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘జ్యోతిలక్ష్మీ’. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కతున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం గోవాలో జరుగుతుంది. ఇటీవలే ఛార్మి తాను పెళ్లి చేసుకోబోతున్నట్లుగా షూటింగ్ స్పాట్ లో పెళ్లి డ్రెస్ లో వున్న ఓ సెల్ఫీ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి హల్చల్ చేసిన విషయం తెలిసిందే.

అయితే ఈ అమ్మడికి ఇటీవలే షూటింగ్ సమయంలో గాయలయ్యాయి. గోవాలో ఛార్మి మరియు కొంతమంది ఫైటర్స్ పై ఓ యాక్షన్ సీన్ ను చిత్రీకరిస్తుండగా... ఓ ఫైటర్ చేతిలో నుంచి హాకీ స్టిక్ చేజారిపోయి.. ఛార్మి మొహంపై బలంగా తాకడంతో... గాయమయ్యింది. దీంతో వెంటనే ఛార్మిని హాస్పిటల్ కు తరలించారు.

చికిత్స అనంతరం దాదాపు 6 గంటలు విశ్రాంతి తీసుకున్న ఛార్మి... ఆ తర్వాత వెంటనే మళ్లీ షూటింగ్ లో పాల్గొని, ఆ సీన్ ను పూర్తి చేసేసింది. దీంతో ఛార్మికి యాక్టింగ్ మీదున్న ఆసక్తికి అక్కడి వారంతా ప్రశంసించారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. షూటింగ్ త్వరగా పూర్తి చేసుకొని, జూన్ నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Charmme  Injured  Jyothi lakshmi  Puri Jagannadh  

Other Articles