Kanchana2 | movie | Raghava Lawrence

Kanchana2 movie release on 17 april

Kanchana2 release date, Kanchana2 movie release date, Kanchana2 censor report, Kanchana2 latest news, Kanchana2 movie news, Kanchana2 movie updates, Kanchana2 movie stills, Kanchana2

Kanchana2 movie release on 17 april: Raghava lawrence latest movie Kanchana2. Tapsee heroine. Kanchana2 movie release on 17 april.

విడుదలకు సిద్ధమవుతున్న కాంచన2

Posted: 04/08/2015 05:55 PM IST
Kanchana2 movie release on 17 april

రాఘవ లారెన్స్ హీరోగా తెరకెక్కిన ‘ముని’, ‘కాంచన’ చిత్రాలు తెలుగు, తమిళ భాషలలో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. లారెన్స్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలోని లారెన్స్ నటనకు భారీ ప్రశంసలు దక్కాయి. ‘ముని’ సినిమాను మించి ‘కాంచన’ సినిమా ఘనవిజయం సాధించింది.

ప్రస్తుతం లారెన్స్ ఈ చిత్రానికి సీక్వెల్ గా ‘కాంచన2’ చిత్రాన్ని తెరకెక్కించారు. హర్రర్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో లారెన్స్ సరసన తాప్సీ హీరోయిన్ గా నటించింది. నిత్యామీనన్ ఓ కీలక పాత్రలో నటించింది. ఇటీవలే తమిళ వర్షెన్ కు సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.

తమిళంలో ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ అందజేసారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 17న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేయనున్నారు. ఇటీవలే విడుదలైన ‘కాంచన2’ ఫోటోలకు భారీ రెస్పాన్స్ వస్తోంది. లారెన్స్ కొత్త గెటప్ లో అదరగొడుతున్నాడు.

భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా హిట్టయితే ఇక ‘కాంచన2’కు కూడా సీక్వెల్ తెరకెక్కిస్తాడేమో అనే సందేహాలు మొదలయ్యాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kanchana2  Release date  Stills  

Other Articles