R Narayana Murthy | Speech | Rey Platinum Disc

R narayana murthy speech in rey movie platinum disc function

R Narayana Murthy Speech in Rey, Rey Pawanism Song Launched, R Narayanamurthy launch Rey Pawanism Song, R Narayanamurthy Pawanism Song, Rey Pawanism Song, Rey Pawanism Song release date, Rey Pawanism Song news, Rey Pawanism Song posters, Rey movie updates, Rey movie news, Rey posters, Rey songs

R Narayana Murthy Speech in Rey Movie Platinum Disc Function: Watch R Narayanamurthy Speech @ Rey Platinum Disc Function. This movie is directed and produced by Y.V.S Chowdary. music of the film composed by Chakri. Sai Dharam Tej, Saiyami Kher, Shraddha Das act in lead roles.

అయ్యా మీకో దండం... బూతులు తగ్గించండి!

Posted: 04/02/2015 12:20 PM IST
R narayana murthy speech in rey movie platinum disc function

వైవియస్ చౌదరి స్వీయ దర్శక నిర్మాణంలో సాయిధరమ్ తేజ్ హీరోగా సయామీ ఖేర్, శ్రద్ధాదాస్ లు హీరోయిన్లుగా నటించిన ‘రేయ్’ సినిమా ఇటీవలే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో పవనిజం సాంగ్ ను జతచేసారు. ఈ పవనిజం పాట విడుదల కార్యక్రమానికి పీపుల్స్ స్టార్, దర్శకుడు ఆర్.నారాయణ మూర్తి ప్రత్యేక అతిథిగా విచ్చేసి, ఆడియో విడుదల చేసిన విషయం తెలిసిందే.

అయితే తాజాగా ఈ చిత్ర యూనిట్ ప్లాటినమ్ డిస్క్ కార్యక్రమాన్ని జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి కూడా ఆర్.నారాయణమూర్తి ప్రత్యేక అతిథిగా విచ్చేసారు. ఈ సంధర్భంగా ఆర్.నారాయణ మూర్తి మాట్లాడుతూ చిత్ర యూనిట్ ను ప్రశంసలతో ముంచెత్తారు. దర్శకుడు వైవియస్ ఈ సినిమా కోసం పడ్డ కృషిని కొనియాడారు.

ఇక చివర్లో ఈ చిత్రానికి మాటలు రాసిన శ్రీధర్ సీపాన గురించి నారాయణ మూర్తి ప్రత్యేకంగా చెబుతూ... ‘అయ్యా ఈ సినిమా డైలాగ్స్ చూసానండి. బూతులు బాగా ఎక్కువయ్యాయండి. అయినా ఈ మధ్య వచ్చే సినిమాల్లో ఇలాంటివే వుంటున్నాయి. కాస్త బూతులు లేకుండా డైలాగులు రాయండి. మీకే కాదండి... ఇతర దర్శకులకు, కథ రచయితలకు, డైలాగ్స్ రైటర్స్ కు దండం పెట్టి మరీ కోరుతున్న... బూతులు లేకుండా రాయండి అంటూ ఆర్.నారాయణ మూర్తి తన ప్రసంగాన్ని ముగించారు.

video courtesy: iDream Film Studio

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : R Narayana Murthy Speech  Rey Platinum Disc Function  Trailers  

Other Articles