Amy jackson replace kriti sanon akshay kumar singh is bling movie prabhudeva

kriti sanon news, kriti sanon latest news, kriti sanon hot photos, kriti sanon hot photo shoot, kriti sanon singh is bling, amy jackson news, amy jackson hot photo shoot, amy jackson bikini photos, akshay kumar news, akshay kumar movies, akshay kumar singh is bling, prabhudeva news, singh is bling movie updates

amy jackson replace kriti sanon akshay kumar singh is bling movie prabhudeva : Kriti sanon is out of prabhudeva and akshay kumar's singh is bling project due to dates problems. In her role amy jackson is replaed.

అడ్జస్ట్ చేసుకోలేక బయటికొచ్చేసింది!

Posted: 03/13/2015 03:34 PM IST
Amy jackson replace kriti sanon akshay kumar singh is bling movie prabhudeva

‘నేనొక్కడినే’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది నటి కృతిసనన్! ఈ అమ్మడికి తెలుగులో అంతగా అవకాశాలు లేకపోయినా.. బాలీవుడ్ లో బాగానే వస్తున్నాయి. అక్కడ ఈమె నటించిన తొలిచిత్రం ‘హీరోపంతి’ హిట్ సాధించడంతో ఈమెకు ఆఫర్ల వెల్లువ వుంది. అయితే.. ఈ విధంగా తనకు ఆఫర్లు రావడంతో అమ్మడు తన డేట్స్ అడ్జస్ట్ చేసుకోలేకపోతోంది. డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఇప్పటికే కొన్ని కొత్త చిత్రాలను వదిలేసుకున్న ఈ పొడుగుకాళ్ల సుందరి.. ఏకంగా అక్షయ్ కుమార్ తో కలిసి చేయాల్సిన భారీ మూవీనే వదులుకుంది.

ప్రముఖ నృత్యకారుడు, దర్శకుడు ప్రభుదేవా దర్శకత్వంలో అక్షయ్ కుమార్ హీరోగా ‘సింగ్ ఈజ్ బ్లింగ్’ పేరిట ఓ మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే! మొదట ఈ చిత్రంలో కథానాయికగా కృతి సనన్ ఛాన్స్ కొట్టేసింది. ఈ క్రమంలో తనకు ఎన్ని సినిమాలున్నప్పటికీ ఎంతో కష్టపడిమరీ డేట్స్ అడ్జస్ట్ చేసుకుంది. ఈ మూవీలో కొన్ని యాక్షన్ సీన్లలో నటించాల్సి వుంటుంది కాబట్టి.. అందుకు శిక్షణ కూడా తీసుకుంది. అక్షయ్ కుమార్ తనకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న ‘జిమ్’లో ఈ అమ్మడు కొన్నాళ్లపాటు రిహార్సల్స్ కూడా చేసింది. ఈ సినిమాకోసం తన పాత్రమేరకు ఎలా తయారవ్వాలో అందుకు తగ్గట్టుగా అన్నీ ఏర్పాట్లు చేసుకుంది. అయితే.. ఈ మూవీ అనుకున్న తేదీకి పట్టాలెక్కకపోవడంతో కృతి సనోన్ తప్పుకోవాల్సి వచ్చింది. ఇతర మూవీ షూటింగులతో బిజీగా వున్నందున్న షూటింగ్ పోస్ట్ పోన్ అయిన అక్షయ్ మూవీకి డేట్స్ అడ్జస్ట్ చేసుకోలేక బయటికొచ్చేసింది. ఈ విషయాన్ని కృతి స్వయంగా ప్రకటించింది కూడా!

‘అక్షయ్ కుమార్ సరసన నటించాల్సిన ‘సింగ్ ఈజ్ బ్లింగ్ మూవీకోసం ఎంతగా ప్రయత్నించినా డేట్స్ ఇవ్వలేకపోయాను. అందుకే.. ఓ మంచి ఛాన్సును వదులుకుంటున్నాను’ అని అమ్మడు స్పష్టం చేసింది. ఇక ఈమె స్థానంలో ‘ఐ’ భామ అమీ జాక్సన్ ను తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే తాను అమీకి బెస్ట్ విషెస్ చెబుతున్నానని, ఆ పాత్రకు ఆమె పర్ ఫెక్ట్ గా సూటవుతుందని ఆమె తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kriti sanon  singh is bling movie  amy jackson  prabhudeva  akshay kumar  

Other Articles