Star mahila telugu television entertainment programme anchor suma limca book of records

star mahila show, anchor suma news, limca book records, etv channel, anchor suma latest news, anchor suma records, suma limca book record, anchor suma photos, anchor suma star mahila, star mahila programme

star mahila telugu television entertainment programme anchor suma limca book of records : Suma has entered the Limca Book Of Record for starmahila being the longest running women's game show being hosted by single host.

లిమ్కా బుక్ రికార్డులకెక్కిన ‘స్టార్ మహిళ’ యాంకర్!

Posted: 03/04/2015 09:22 PM IST
Star mahila telugu television entertainment programme anchor suma limca book of records

ప్రముఖ యాంకర్ సుమా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘స్టార్ మహిళ’ కార్యక్రమం ఇప్పటికే బుల్లితెరలో ఎన్నో రికార్డులను సృష్టించింది. మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రముఖ తెలుగు టీవీ చానెల్ ఈటీవీలో వచ్చే ఈ షోకి ఎంతో ఆదరణ లభించింది. ఈ షో మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ‘ఈ’ చానెల్ మంచి టీఆర్పీ రేటింగులు తెచ్చిపెట్టింది. దీంతో ఆ చానెల్ యాజమాన్యం ఈ షోని ఆపకుండా నడుపుతూనే వున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ కార్యక్రమం మరో రికార్డును తన ఖాతాలో జమ చేసుకుంది.

తాజాగా ‘స్టార్ మహిళ’ కార్యక్రమం లిమ్కా బుక్ రికార్డులకు ఎక్కింది. మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ అందిస్తున్న ఈ కార్యక్రమం ఆగష్టు 9, 2008లో ప్రారంభమైంది. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు ఈ కార్యక్రమం ఎటువంటి ఆటంకాలు లేకుండా 1815 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. ఒక మహిళ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న గేమ్ షో ఇన్ని ఎపిసోడ్స్ పూర్తి చేసుకోవడం ఇదే ప్రధమం. అందుకే ఈ షోతోపాటు యాంకర్ సుమా కూడా ఈ లిమ్కా బుక్ రికార్డుల్లోకెక్కింది. ఈ విషయాన్ని లిమ్కా బుక్ యాజమాన్యం అధికారికంగా వెల్లడిస్తూ ప్రకటన విడుదల చేసింది.

limca-book-records-suma

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : star mahila telugu show  anchor suma  limca book records  

Other Articles