Samantha ruth prabhu twitter account break senation internet social media fans

samantha ruth prabhu, samantha twitter account, samantha latest news, samantha hot photos, samantha latest photos, samantha updates, samantha gossips, samantha good friday festivals, samantha news, samantha twitter updates, samantha hot comments, samantha

samantha ruth prabhu twitter account break senation internet social media fans : Samantha ruth prabhu given a sensational statement that she taking break from her twitter account.

సమంత.. పిట్ట కొంచెం కూత ఘనం?

Posted: 02/23/2015 11:32 AM IST
Samantha ruth prabhu twitter account break senation internet social media fans

గ్లామర్ డాల్ సమంతాకు ఏమైందో ఏమో తెలియాదు కానీ.. వున్నట్లుండి ఓ సంచలనాత్మకమైన నిర్ణయాన్ని తీసుకుంది. నిత్యం సోషల్ మీడియా (ట్విటర్)లో సినిమా విశేషాలను, ఇతర వివరాలను అప్ డేట్ చేస్తూ అభిమానులకు దగ్గరగా వుండే నటి.. ఇప్పుడు అందుకు దూరంగా వుంటున్నానని తానే స్పష్టం చేసింది. దీంతో ఈమెకు ఏమైందంటూ వార్తల మీద వార్తలు వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా అభిమానులైతే ఈ విషయంపై విచారం వ్యక్తం చేస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. సమంత ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను తన ‘పిట్ట’ ద్వారా వెల్లడించే సమంత.. ఈసారి దానిచేత ఘనమైన కూతనే కూయించింది. ‘కొన్నాళ్లు ట్విటర్ కి దూరంగా వుంటున్నాను, గాడ్ బ్లెస్, బీ గుడ్’ అంటూ ఈ ముద్దుగుమ్మ తాజాగా ట్వీట్ చేసింది. ఈ విధంగా ఈమె ట్వీట్ చేయడంపై అభిమానులు ఖంగుతిన్నారు. అటు సినీ సర్కిల్స్ లోనూ ఈ విషయంపై రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఎప్పుడూ ట్విటర్ లో యాక్టివ్ గా వుండే సమంతా.. దాన్నుంచి ఎందుకు దూరంగా జరుగుతోందంటూ చెప్పుకుంటున్నారు. ఇదిలావుండగా.. సమంతా ట్విటర్ నుంచి దూరంగా జరగడానికి ఒక కారణముందంటూ వార్తలొస్తున్నాయి.

samantha-twitter-account

అదేమిటంటే.. ప్రపంచవ్యాప్తంగా వుండే క్రిస్టియన్స్ అందరూ తాము ఎంతో ఆరాధ్యంగా భావించే ఏసుక్రీస్తు శిలువును ఎక్కించే ‘గుడ్ ఫ్రైడే’ రోజు దగ్గరపడుతుండటంతో.. తాము ఎంతో నిష్టగా నిర్వహించే లెంట్ సందర్భంగా వివాదాలకు, విలాసాలకు దూరంగా వుంటారు. పైగా.. ఇటీవలే రష్యాలోని మతపెద్దలు 40 రోజులపాటు ఈస్టర్ పండుగ వచ్చేదాకా ట్విటర్, ఇస్ స్టాగ్రామ్, ఇతర సోషల్ నెట్ వర్కింగ్ సైట్లకు దూరంగా వుండమని ఆదేశించారట! ఆ మాటల ప్రభావంతోనే సమంత కూడా ట్విటర్ నుంచి కాస్త బ్రేక్ తీసుకుందని అనుకుంటున్నారు. ఏదైతేనేం.. ఈసారి సమంత పిట్ట.. ఘనమైన కూతకోసం సంచలనం రేపింది!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : samantha twitter  tollywood gossips  telugu heroines updates  

Other Articles

 • Vaishnav tej to make acting debut with uppena his first look poster raises curiosity

  ‘ఉప్పెన’లా దూసుకెళ్తున వైష్ణవ్‌ తేజ్..

  Jan 23 | సాయి తేజ్‌ సోదరుడు వైష్ణవ్‌ తేజ్‌ కథానాయకుడిగా వెండితెరకు పరిచయమవుతోన్న చిత్రం ‘ఉప్పెన’. బుచ్చిబాబు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా ప్రీలుక్‌ మాస్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న... Read more

 • Tollywood comedian sunil admitted to hospital for sinusitis

  నటుడు సునీల్ కు అస్వస్థత…. అభిమానుల్లో ఆందోళన

  Jan 23 | టాలీవుడ్‌ ప్రముఖ నటుడు సునీల్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన గచ్చిబౌలిలోని ఏషియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆస్పత్రితో చేరారు. దీంతో సునీల్‌ అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. హీరో... Read more

 • Allu arjun s uncle rajendra prasad passes away in vijaywada

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కుటుంబంలో విషాదం..

  Jan 23 | ‘అల వైకుంఠపురంలో’ సూపర్‌ సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్న అల్లు అర్జున్‌ కుటుంబంలో విషాదం నెలకొంది. బన్నీ మేనమామ ముత్తంశెట్టి రాజేంద్ర ప్రసాద్‌ గుండెపోటుతో మరణించారు. విజయవాడలోని ఆయన నివాసంలో బుధవారం ప్రసాద్‌ కన్నుమూశారు. అల్లు... Read more

 • Super star rajinikanth s darbar joins 200 crore club

  రూ.200 కోట్ల క్లబ్ లోకి రజనీ ‘దర్భార్’.!

  Jan 22 | సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఖాతాలో మరో రూ.200 కోట్ల సినిమా చేరింది. ఆయన పోలీసు అధికారిగా నటించిన సినిమా ‘దర్బార్‌’. ఎ.ఆర్‌. మురుగదాస్‌ దర్శకుడు. నయనతార, నివేదా థామస్‌, సునీల్‌ శెట్టి, యోగిబాబు తదితరులు దీనిలో... Read more

 • Allu arjun s ala vaikunthapurramuloo 10 days share 143 not out

  అల్లు అర్జున్ కెరీర్ బెస్ట్ రికార్డ్ ‘అలా వైకుంఠపురంలో’.!

  Jan 22 | అల్లు అర్జున్‌ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం ‘అల వైకుంఠపురములో..’ బాక్సాఫీసు వద్ద తెగ సవ్వడి చేస్తోంది. కేవలం పది రోజుల వ్యవధిలోనే ఏకంగా 220 కోట్ల క్లబ్ లో చేరి... Read more

Today on Telugu Wishesh