Tabu hindi drishyam movie remake ig character bollywood news

tabu news, tabu latest news, tabu hot news, tabu hot photos, tabu hot gallery, tabu hot videos, tabu drishyam movie, tabu ig role, tabu movies, drishyam hindi remake, drishyam hindi movie, ajay devgan news, sonakshi sinha news

tabu hindi drishyam movie remake ig character bollywood news : Actress tabu is playing ig character in hindi drishyam remake movie which is played by nadia in telugu

టబు తన కొడుకును కాపాడుకోగలుగుతుందా..?

Posted: 02/06/2015 03:41 PM IST
Tabu hindi drishyam movie remake ig character bollywood news

నాలుగుపదుల వయస్సు దాటినా ఇంకా పెళ్లికాని టబు.. ప్రస్తుతం తన కొడుకుని ప్రమాదం నుంచి కాపాడుకోవడంలో తీవ్ర ఆందోళన వ్యక్త చేస్తోందని వార్తలు వెలువడుతున్నాయి. అదేంటి..? పెళ్లికాని టబుకి కొడుకు ఎక్కడి నుంచి వచ్చాడు. దత్తత తీసుకుందా ఏంటి..? అని అనుకుంటున్నారా! అసలు ఆ కొడుకు ఎవరో, అతని ప్రాబ్లమ్ ఏంటో, టబు చెందుతున్న ఆందోళన విషయాలను తెలుసుకోవాలంటే ఈ మేటర్’లోకి వెళ్లాల్సిందే!

ఇటీవలే మలయాళ, తెలుగు భాషల్లో రూపొందిన ‘దృశ్యం’ సినిమా ఘనవిజయం సాధించి, విమర్శల ప్రశంసలు పొందిన విషయం తెలిసిందే! ఈ సినిమాలో వున్న అన్నీ పాత్రలు కీలకం కావడం వల్ల చాలా ఇంట్రెస్టింగ్’గా కొనసాగుతుంది. సినిమా మొదలైనప్పటి నుంచి చివరివరకు సస్పెన్స్’గా సాగే ఈ మూవీ.. ప్రేక్షకులను బాగా అలరించింది. మొదట మలయాళంలో తెరకెక్కిన ఈ మూవీ.. బాక్సాఫీస్’లో డబ్బుల వర్షాన్ని కురిపించింది. అతి తక్కువ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం దాదాపు రూ.50 కోట్లమేర అక్కడ వసూళ్లను రాబట్టింది. దీంతో దీన్ని తెలుగులో రీమేక్ చేయడం జరిగింది. ఇప్పుడు హిందీలోనూ ఈ చిత్రాన్ని రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

నిశికాంత్ కామత్ దర్శకత్వం వహిస్తున్న ‘దృశ్యం’ హిందీ రీమేక్’లో అజయ్ దేవగన్, సోనాక్షీ సిన్హా జంటగా నటిస్తున్నారు. ఇక ఈ మూవీలో చాలా కీలకమైన ఐజీ పాత్రలో టబు నటించినుందని సమాచారం! తెలుగు ‘దృశ్యం’లో ఐజీ క్యారెక్టర్ కూడా ముఖ్య భూమిక పోషించిన విషయం విదితమే! ఆ ఐజీ పాత్రలో నదియా అద్భుత నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. అందులో నదియా కొడుకు చనిపోగా.. అతని మరణం వెనకాల వున్న మిస్టరీని ఛేదించే ఐజీ పాత్రలో ఈమె నటించింది. ఆ పాత్రనే టబు ఇప్పుడు హిందీ రీమేక్’లో పోషించనుంది. మరి.. హిందీ రీమేక్ చిత్రంలో టబు తన కొడుకును కాపాడుకుంటుందా..? లేదా తెలుగులోలాగే అతను చనిపోతాడా..? అన్నది తెలుసుకోవాలంటే... మూవీ రిలీజ్ వరకు ఆగాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tabu drishyam movie  ajay devgan news  sonakshi sinha  

Other Articles