Temper audio release postponed from 18th january

Temper movie, Temper audio release, Temper audio release postponed, Temper latest wallpapers, Temper latest updates, NTR movies, Ntr in temper movie, NTR latest wallpapers, tollywood updates, upcoming telugu movies

Temper audio release postponed from 18th january : latest news that NTR latest movie Temper audio not releasing on 18th January. Temper film shooting of talkie part comes to end. cast and crew working hard to complete movie in time

అయ్యో మళ్లీ మారిందా ఏంటి..?

Posted: 01/12/2015 03:05 PM IST
Temper audio release postponed from 18th january

అందరు హీరోల సినిమాలు వివాదాలమయం అవుతుంటే.., ఎన్టీఆర్ మూవీలు మాత్రం వాయిదాల మయం అవుతున్నాయి. ఉదాహరణకు ‘టెంపర్’ మూవీనే తీసుకుంటే ఇప్పటివరకు ఈ సినిమా ఎన్నోసార్లు వాయిదా పడింది. విడుదల తేదీ, ఆడియో రిలీజ్, షూటింగ్ ఇలా ప్రతి విషయంలో పోస్ట్ పోన్ లేనిదే పని జరగలేదు. అనివార్య కారణాల వల్ల సినిమా విడుదల సంక్రాంతికి జరగటం లేదన్న విషయం తెలిసిందే. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.., ఈ మూవీ ఆడియో విడుదల కూడా వాయిదా పడినట్లు తెలుస్తోంది.

ముందుగా ప్రకటించినట్లు జనవరి 18న ‘టెంపర్’ ఆడియో రిలీజ్ ఉండకపోవచ్చని ఫిలింనగర్ లో ప్రచారం జరగుతోంది. ఇందుకు కారణం షూటింగ్ మిగిలి ఉండటమేనట. చివరి దశ అని ఎప్పటినుంచో చెప్పుకుంటున్న షూటింగ్ ఇంకా పూర్తికాలేదు. సంక్రాంతి సంబరాలు మొదలు కావటంతో.., ఆర్టిస్టులంతా ఇంటిబాట పడుతున్నారు. దీంతో ఈ వారంలో షూటింగు జరిగే అవకాశం తక్కువ. మళ్ళీ సోమవారం నుంచి షూటింగ్ కంప్లీట్ గా మొదలు అయ్యే అవకాశం ఉంది. ముందు సినిమా పూర్తి చేసి ఆ తర్వాత మిగతా పనులు చేసుకోవాలని మూవీ యూనిట్ డిసైడ్ అయింది. దీంతో ఆడియో రిలీజ్ వేడుకను 18కి బదులు 24 లేదా 25 తేదీల్లో నిర్వహించే అవకాశం ఉంది.

సినిమా విడుదలలో మాత్రం ఎలాంటి మార్పు లేదని మూవీ యూనిట్ స్పష్టం చేస్తోంది. టాకీ పార్ట్ చివరి దశ పూర్తి కాగానే వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనుల వేగం పెంచుతామని చెప్తున్నారు. షూటింగ్ తో పాటే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతుండటంతో విడుదల ఆలస్యం కాదు అని స్పష్టం అవుతోంది. ‘ఆంధ్రావాలా’ ఫ్లాపు తర్వాత పదేళ్లు గ్యాపు తీసుకుని మళ్ళీ ఎన్టీఆర్-పూరీ కాంబినేషన్ మూవీ వస్తుండటంతో ఎలా ఉంటుందా అని నందమూరి అభిమానులు ఎదురుచూస్తున్నారు. ‘బృందావనం’, ‘బాద్ షా’ సినిమాల తర్వాత ఎన్టీఆర్ తో కాజల్ నటిస్తున్న మూడవ సినిమా ఇది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Temper movie  NTR latest  tollywood updates  

Other Articles