Anisha ambrose in gopala gopala movie

Gopala Gopala movie, Gopala Gopala review, Gopala Gopala movie rating, Gopala Gopala movie latest updates, Anisha Ambrose in Gopala Gopala, Anisha Ambrose, Anisha Ambrose photos, Anisha Ambrose latest, tollywood updates, Anisha Ambrose movies, Upcoming telugu movies

Anisha Ambrose in Gopala Gopala movie : Gabbarsingh2 movie heroine Anisha Ambrose played TV Anchor role in Gopala Gopala movie. Anisha Ambrose surprised Pawan fans with her role in Gopala Gopala movie.

పవన్ ఫ్యాన్స్ కు సర్ ఫ్రైజ్.. ‘గోపాల గోపాల’లో అనిషా..,

Posted: 01/10/2015 02:59 PM IST
Anisha ambrose in gopala gopala movie

‘గబ్బర్ సింగ్2’ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తిన అనిషా అంబ్రోస్ పవన్ ఫ్యాన్స్ కు మరో సర్ ప్రైజ్ ఇచ్చింది. పవన్ లేటెస్ట్ మూవీ ‘గోపాల గోపాల’లో ఈ అమ్మడు నటించిందట. విడుదల వరకు చాలా సీక్రెట్ గా ఉన్న ఈ విషయం సినిమా చూస్తే కాని అర్థం కాలేదు. ఇంతకీ అనీషా ఎక్కడుంది అనే కదా మీ డౌట్. వెంకటేష్ ను ఓ కీలక సన్నివేశంలో ఇంటర్య్వూ చేసే టీవీ యాంకర్ గా కన్పించిందట. అయితే యాంకర్ గా వచ్చిన అమ్మాయి అనిషా కాదు అని కొందరు ఫ్యాన్స్ అంటున్నారు. మరికొందరు మాత్రం యాంకరమ్మ అనిషానే కానీ కాస్ట్యూమ్స్ వల్ల సరిగా గుర్తుపట్టలేమని చెప్తున్నారు.

‘గోపాల గోపాల’ సినిమా షూటింగ్ సమయంలో పవన్ ను కలిసి ఫోటో దిగి.., సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసి అనిషా సంచలనం కల్గించిన విషయం తెలిసిందే. అప్పుడు కేవలం మామూలుగా కలిసినట్లు చెప్పినా.., ఆ తర్వాత ‘గబ్బర్ సింగ్2’ కోసం కలిసినట్లు అంతా చెప్పారు. కానీ మాత్రం వీరిద్దరూ షూటింగ్ సమయంలో కలిశారని ఇప్పుడు తెలుస్తోంది. మూవీలో నటించిన అనిషా షూటింగ్ స్పాట్ లో పవన్ ను కలిసి ఫోటో దిగిందనీ.., ఆ తర్వాత ఈమెనే ‘గబ్బర్ సింగ్2’ కోసం ఎంపిక చేశారని సీన్ మొత్తం అర్థమవుతోంది.

ఇంకో విషయం ఏమిటంటే ఈ అమ్మడు పవన్ కంటే ముందే మెగా ఫ్యామిలీతో సంబంధం ఉంది. మెగా ఫ్యామిలీకి చెందిన వెంకట్ రాహుల్ తో అనిషా తొలి సినిమా ‘అలియాస్ జానకి’ వచ్చింది. అయితే అదృష్టం కలిసి రాకపోవటంతో ఇండస్ర్టీకి దూరంగా నిలుచుంది. కానీ ‘గబ్బర్ సింగ్2’ రూపంలో బంపర్ ఆఫర్ తగలటంతో అంతా షాక్ అయ్యారు. టాప్ హీరోయిన్లు అయితే, తమకు ఛాన్స్ ఇవ్వకుండా పవన్ ఇలా ఎందుకు చేశాడు అని ఇప్పటికీ కుళ్ళుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Anisha Ambrose  Gopala Gopala movie  Pawan Kalyan  

Other Articles