Alia bhatt rejects akhil movie offer

alia bhatt rejects akhil, alia bhatt on akkineni akhil movie, akkineni akhil latest news updates, akkineni akhil movie latest, alia bhatt upcoming movie updates, tollywood latest movie updates

alia bhatt rejects akhil movie offer : tollywood latest news that bollywood star alia bhatt rejected akkineni akhil movie because of her previous commitments, akhil faces sad result from alia bhatt with her rejection to his debut film

కొత్త పిల్లను వెతుకుతున్నారట

Posted: 12/16/2014 03:24 PM IST
Alia bhatt rejects akhil movie offer

పిలిచి పిల్లనిస్తానంటే.. ఎక్కడో తన్నినట్లుగా ఉంది ఈ బాలీవుడ్ భామ యవ్వారం. తెలుగులో సినిమా ఆఫర్ ఇస్తానంటే ఇప్పుడు నాకు టైం లేదు అని చెప్పిందట. దీంతో చినబాబు పాపం తెగ ఫీల్ అవుతున్నట్లుంది. ఏరికోరి ఎంపిక చేసుకుంటే ఇలా ఎగతాళి చేసిందేమిటా అని చాలా బాధపడుతున్నాడని టాక్ విన్పిస్తోంది. దీంతో ఇంకో హీరోయిన్ కోసం వెతుకులాటలో పడింది  అక్కినేని ఫ్యామిలి. ఈ స్టోరి అంతా అక్కినేని కుటుంబం నుంచి హీరోగా వచ్చేందుకు వెయిట్ చేస్తున్న అఖిల్ గురించే.

బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అలియా భట్ ఇప్పుడిప్పుడే ఇండస్ర్టీలో బిజీ అవుతోంది. అమ్మడు చేసిన సినిమాలన్నీ షాకింగ్ హిట్లే. దీంతో తెలుగులో కూడా హిట్ కొట్టించాలని భావించి అఖిల్ మూవీ యూనిట్ అలియాను కలిసిందట. తెలుగులో అఖిల్ పక్కన హీరోయిన్ గా నటించాలని కోరిందట. అయితే అప్పటికే మిగతా సినిమాలకు డేట్లు ఇచ్చేయటంతో ఇప్పుడయితే సినిమా చేయలేను అని సున్నితంగా తిరస్కరించిందట. దీంతో ఏం చేస్తాం అనుకుని వెనక్కి వచ్చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం షాహిద్ కపూర్ తో షాన్ దార్ అనే సినిమాలో అలియా నటిస్తోంది.

అఖిల్ తొలి సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. మూవీకి డైరెక్షన్ చేయనున్న వినాయక్ తల్లి ఇటీవలే చనిపోవటంతో కొద్ది రోజులు ఆలస్యంగా సినిమా ప్రారంభం అవుతుందని సన్నిహితులు చెప్తున్నారు. నాగార్జున, సుధాకర్ రెడ్డి కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందించనున్నాడు. అఖిల్ కు భారీ ఎంట్రీ లభించేలా వినాయక్ కథను సిద్దం చేసినట్లు తెలుస్తోంది. సినిమా విడుదల కాకముందే హీరోగా చాలా క్రేజ్ సంపాదించుకున్న అఖిల్ మూవీ ఎప్పుడు వస్తుందా అని అక్కినేని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : alia bhatt movies  akkineni akhil debut  tollywood latest  

Other Articles