Vikram i movie telugu audio launch date

I movie telugu audio, vikram latest updates, vikram i movie news, shanker i movie updates, ami jackson latest updates, i cinema vaarthalu, i movie telugu audio, vikram movie latest updates

After Tamil, all set to lauch of Telugu I audio soon

విక్రమ్ ‘ఐ’ తెలుగు అడియో రిలీజ్ కు సర్వం సిద్దం..

Posted: 12/10/2014 07:39 PM IST
Vikram i movie telugu audio launch date

విక్రమ్, అమీ జాక్సన్ జంటగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ఐ’. తమిళనాడు జక్కన శంకర్ చేతిలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్ ట్రైలర్ కు భారీ స్పందన వచ్చింది. దాదాపు 180కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పిసి శ్రీరాం సినిమాటోగ్రఫి, ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. భారీ సాంకేతిక నిపుణులతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

ఇటీవలే తమిళనాట ఘనంగా ఆడియోను విడుదల చేయగా, పాటలకు కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్సాన్స్ వచ్చింది. అయితే ఈ చిత్ర తెలుగు ఆడియోను ఈనెల 15వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలిసింది. ముందుగా 10వ తేదీన విడుదల చేయబోతున్నారని వార్తలొచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం 15న తెలుగు వర్షెన్ ఆడియోను విడుదల చేయబోతున్నారని తెలిసింది.

హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియం ఈ ఆడియో విడుదల కార్యక్రమానికి వేడుక కానుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు మరికొద్ది రోజుల్లో ప్రారంభించనున్నారు. ఈ ఆడియో విడుదల కార్యక్రమానికి చైనీస్ సూపర్ స్టార్ జాకీచాన్ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. వీరితో పాటు పలువురు తెలుగు అగ్రహీరోలు హాజరుకాబోతున్నట్లుగా సమాచారం. అయితే ఈ విషయంపై ఇప్పటికీ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఆస్కార్ రవిచంద్రన్ నిర్మించిన విజువల్ వండర్ ‘ఐ’ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles