ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్’గా కొనసాగిన త్రిష కెరీర్ గతకొన్నాళ్లక్రితం పూర్తిగా గాడిలో పడిపోయింది. అవకాశాలకోసం ఎన్నిప్రయత్నాలు చేసినా... ఫలితం మాత్రం శూన్యంగానే వుండేది. అయినా పట్టువదలకుండా ఆఫర్లకోసం తెగ ట్రై చేసింది. అలా చేసిన చాలాకాలానికి అమ్మడికి కాలం కలిసివచ్చేసింది. ఒక ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చే ఛాన్సులు లేదని అంతా అనుకుంటున్న సమయంలో గ్రాండ్’గా రీఎంట్రీ ఇచ్చి అందరినీ షాక్’కు గురిచేసింది. కన్నడ సినిమాతో ఈ మూడుపదుల గ్లామర్ భామ కెరీర్ మళ్లీ సక్సెస్ బాటలో వచ్చేసింది. దీంతో అటు తమిళంతోపాటు ఇటు తెలుగు, కన్నడ భాషల్లోనూ వరుస ఆఫర్లు వస్తున్నాయి. అయితే ఓ బిజినెస్’మేన్ ఈమె కెరీర్’లోకి ఎంట్రీ ఇవ్వడంతో అంతా స్పాయిల్ అయినట్లు వార్తలొస్తున్నాయి. ఎప్పుడైతే ఆ బిజినెస్’మేన్ ఎంట్రీ ఇచ్చాడో.. అప్పటినుంచి త్రిషకు వచ్చిన అవకాశాలు ఒక్కొక్కటిగా దూరమవుతున్నాయని ఆమె లబోదిబోమంటూ ఏడుస్తోందని ప్రచారాలు కొనసాగుతున్నాయి.
చాలారోజుల తర్వాత సినిమా అవకాశాలను అందిపుచ్చుకుంటున్న త్రిషకు సంబంధించి ఇటీవలే ఓ పెళ్లి వార్త బయటికొచ్చింది. చెన్నైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త వరుణ్ మణియన్’తో త్రిష ప్రేమలో పీకల్లోతు మునిగిపోయిందని, త్వరలోనే వీళ్ళిద్దరి పెళ్లి కూడా జరగబోతోందని వార్తలొచ్చాయి. ఇప్పుడు ఆ వార్త ఆమె కెరీర్’కి బాగానే ఎసరు పెట్టినట్లు సమాచారం! త్రిష పెళ్లి వార్త బయటికి రావడం వల్లే ఆ అమ్మడికి ఒక అవకాశం వచ్చినట్లు వచ్చి చేజారిపోయిందని తెలుస్తోంది. తమిళంలో ‘ఉదయం ఎన్ఎచ్-9’ మూవీని తెరకెక్కించిన దర్శకుడు... హీరో జీవా, త్రిషలతో కలిసి ఓ చిత్రాన్ని తెరకెక్కించాలని ప్లాన్ చేసుకున్నాడట! అయితే ఇంతలోనే త్రిష పెళ్లి వార్త బయటికి రావడంతో ఆమెను ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పించేశారు. త్రిష పెళ్లి కోసమని మధ్యలోనే వెళ్లిపోతే చాలా ఇబ్బందులొస్తాయని భావించిన దర్శకుడు.. ఆమె స్థానంలో సురభిని కథానాయికగా తీసుకున్నారని కోలీవుడ్ వార్తలు!
ఇలా ఈ విధంగా త్రిషకు అందాల్సిన ఆ ప్రాజెక్ట్.. ఒక్కసారిగా చేజారిపోవడంతో త్రిష చాలా ఫీలైపోతోందని సమాచారం! త్రిష జీవితంలో ఆ చెన్నై వ్యాపారవేత్త మణియన్ ఎంట్రీ ఇచ్చుకోవడంతోనే ఆమె కెరీర్’లో మళ్లీ ఇబ్బందులు మొదలయ్యాయని అంటున్నారు. మరోవైపు త్రిష తన పెళ్లి వార్తలు ఖండిస్తోందిగానీ.. అతనితో వున్ లవ్ ఎఫైర్’పై మాత్రం నోరు మెదపడం లేదు. దీంతో వీరిద్దరి మధ్య సమ్’థింగ్ సమ్’థింగ్ నడుస్తోందని.. త్వరలోనే వీళ్ల పెళ్లి ఖాయమని అంతా ఫిక్స్ అయిపోయారు. ఇదిలావుండగా.. ఆ వ్యాపారవేత్త మణియన్ కూడా ‘పెళ్ళి తర్వాత భార్యను ఎలా చూసుకోవాలి?’ అనే పుస్తకాలను చదువుతున్నట్టు తనే స్వయంగా ట్వీట్ చేశాడని చెబుతున్నారు. ఇక ఈ దెబ్బతో వాళ్ల పెళ్లిపై వున్న అనుమానాలు పూర్తిగా క్లియర్ అయినట్టేనని అనుకుంటున్నారు. మరి త్రిష పెళ్లి చేసుకుంటుందా..? లేక ఇందులో కూడా సరికొత్త ట్విస్ట్ ఇస్తుందా..? అనేది వేచి చూడాలి!!!
AS
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more