Arpita khan honey moon trip details

arpita khan marriage photos, arpita khan marriage highlights, arpita khan honey moon tour details, salman arpita khan latest news, aayush sharma marriage latest news, bollywood latest updates, salman khan movies latest updates, hyderabad falaknuma palace, salman khan gift to arpita in mumbai, tourism spots in new zealand, new zealand latest news update, bora bora place tour route

arpita khan honey moon trip details : bollywood body builder salman khan sister arpita khan got marriage on tuesday with aayush sharma in falaknuma palace hyderabad. asper industry rumors newly married couple arpita khan and aayush going for honey moon to new zealand and bora bora but its not confirmed

అర్పిత హనీమూన్ డిటైల్స్ ఇవే

Posted: 11/19/2014 10:44 AM IST
Arpita khan honey moon trip details

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా ఖాన్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్ లోని ఫలక్ నమా ప్యాలెస్ లో జరిగిన ఈ వివాహ వేడుకకు పలువురు బాలీవుడ్ ప్రముఖులతో పాటు, టాలీవుడ్ ప్రముఖులు, ఇతర రంగాల కు చెందిన వారు హాజరయ్యారు. హైదరాబాద్ లో పెళ్లి తంతు ముగియటంతో ఇక రిసెప్షన్ కోసం ఖాన్ ఫ్యామిలి సిద్ధం అవుతోంది. ముంబైలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో ఈనెల 21న ఈ వేడుక జరగనుంది. ఇందుకోసం బాలీవుడ్ ప్రముఖులతో పాటు, ఇతరులకు ఆహ్వానాలు వెళ్లాయి.

ఇక పెళ్లి, రిసెప్షన్ పూర్తికాగానే హనీమూన్ ఉంటుందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. న్యూజిల్యాండ్, బొరాబొరాకు ఈ కొత్త జంట హనీమూన్ కోసం వెళ్తుందని అంటున్నారు. ఈ వార్తలపై సల్మాన్ ఫ్యామిలి ఇంకా స్పందించలేదు. సినిమా ఫ్యామిలి అల్లుడిగా మారిన ఆయుష్ శర్మ కూడా త్వరలోనే ఇండస్ర్టిలోకి వచ్చే అవకాశం ఉంది. అయితే సల్మాన్ ప్రోత్సాహం, సహకారం లేకుండా సొంతంగా సినిమాల్లోకి రావాలని ఆయుష్ బావిస్తున్నట్లు సన్నిహతులు చెప్తున్నారు. సల్లుభాయ్ కుటుంబంతో చాలా కాలంగా సత్సంబంధాలున్నప్పటికీ అర్పితను పెళ్లి చేసుకోవాలని వారు ఎప్పుడూ ఒత్తిడి చేయలేదని ఆయుష్ తెలిపాడు. సల్మాన్ ఫ్యామిలి అంటే తనకు చాలా గౌరవం ఉందని చెప్పాడు

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : arpita  aayush  honey moon  new zealand  bora bora  

Other Articles