Ravi teja sampath nandi movie title is bengal tiger

ravi teja kick2 movie latest updates, ravi teja sampath nandi movie, ravi teja sampath nandi movie title, ravi teja in bengal tiger movie, bengal tiger latest updates, tollywood latest updates

ravi teja sampath nandi movie title is bengal tiger : director sampath nandi making movie with ravi teja this project will start after kick2 shooting comes to climax. sampath nandi searching for title to ravi teja movie film nagar rumors that title will be bengal tiger which will suit ravi

పవన్ డైలాగ్ రవికి టైటిల్ అయింది

Posted: 11/12/2014 03:15 PM IST
Ravi teja sampath nandi movie title is bengal tiger

టాలీవుడ్ అంతా పవన్ మ్యానియాలో మునిగి తేలుతోంది. ఇందుగలడు అందులేడన్నట్లు ఏ కార్యక్రమం చేసినా అందులో పవన్ ప్రస్తావన ఉంటోంది. ఇక సినిమాలు అయితే పవన్ పేరు చెప్పుకుని హిట్ కొడుతున్నాయి. తాజాగా రవితేజ కొత్త సినిమాకు కూడా పవన్ సినిమాలోని ఓ డైలాగ్ ను టైటిల్ గా పెట్టినట్లు తెలుస్తోంది. పవన్ కు మంచి హిట్ ఇచ్చిన ‘ఖుషి’ సినిమాలో పవర్ స్టార్ తనను తాను బెంగాల్ టైగర్ గా చెప్పుకుంటాడు. ఇప్పుడిదే డైలాగ్ ను మాస్ మహారాజ సినిమాకు టైటిల్ గా పెట్టారనే ప్రచారం జరుగుతోంది.

అయితే పవన్ వాడినందునే ఈ డైలాగ్ పెట్టినట్లు మాత్రం చెప్పలేము. కాని రవితేజ బాడి లాంగ్వేజ్ తో పాటు కధకు ఈ టైటిల్ అయితే సూపర్ గా సూట్ అవుతుందని అంటున్నారు. ప్రస్తుతం ఈ టైటిల్ పరిశీలన దశలోనే ఉన్నా, ఇదే ఫైనల్ అవుతుందని అంటున్నారు. పవన్ తో ‘గబ్బర్ సింగ్2’ ప్రాజెక్టు నుంచి బయటకు వచ్చేసిన సంపత్ నంది, రవితేజ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు. కథను పూర్తిగా సిద్దం చేసుకుని ప్రి ప్రొడక్షన్ పనులు చూసుకుంటున్నాడు.

నంది సినిమాలో రవితేజ సరసన తమన్నా హీరోయిన్ గా నటించనుంది. ప్రస్తుతం ‘కిక్2’ షూటింగ్ లో ఉన్న మాస్ మహారాజా, ఈ ప్రాజెక్టు ముగింపుకు చేరుకోగానే నంది సినిమా మొదలు పెట్టేస్తాడట. ఇక ‘కిక్2’ సినిమా 2015 వేసవిలో విడుదల కానుంది.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ravi teja  bengal tiger  latest news sampath nandi  

Other Articles